అన్నంత పని చేసిన బట్లర్ గ్యాంగ్.. సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన భారత్.. ఫైనల్‌కు ఇంగ్లాండ్

T20 World Cup 2022: India and England Ready For Semi-final Fight, Check Live Scores and Updates Here

IND vs ENG Live: మూడు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులకు అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరింది. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనలతో అదరగొట్టిన టీమిండియా,  పడుతూ లేస్తూ సెమీస్‌కు చేరుకున్న  ఇంగ్లాండ్‌లు నేడు అడిలైడ్ వేదికగా తలపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన లైవ్ స్కోరు వివరాలు, అప్‌డేట్స్ మీకోసం... 

4:41 PM IST

చరిత్ర పునరావృతం..

2022  టీ20 ప్రపంచకప్ లో చరిత్ర పునరావృతమైంది.  1992 వన్డే ప్రపంచకప్ లో  ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మధ్యే సెమీస్ జరిగింద. తిరిగి   ఈ ప్రపంచకప్ లో కూడా అవే ప్రత్యర్థులు మళ్లీ ఫైనల్ లో పోటీ పడబోతున్నాయి.  ఈనెల 13న మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్తాన్ లు తలపడతాయి.  మరి పాకిస్తాన్  మళ్లీ హిస్టరీ రిపీట్ చేస్తుందా..? లేక  బట్లర్ గ్యాంగ్  రెండో సారి ప్రపంచకప్ గెలుస్తుందా..? అనేది 13న తేలనుంది. 

4:34 PM IST

ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ..

బట్లర్ గ్యాంగ్ అనుకున్నంత పని చేసింది. రెండో సెమీస్ లో ఇండియాకు షాకిస్తామన్న ఇంగ్లాండ్.. చెప్పింది చేసి చూపించింది. సెమీఫైనల్ లో ఇండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా  ఛేదించింది. దీంతో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది.  ఫైనల్ లో  ఇంగ్లాండ్ - పాకిస్తాన్  తలపడుతాయి. 

4:29 PM IST

ప్చ్.. ఆ ఒక్కటైనా దక్కేదిగా సూర్య..

మ్యాచ్ ఓడిపోతామని తెలిసినా ఒక్క వికెట్ అయినా  దక్కాలని చూస్తున్న టీమిండియా ఫ్యాన్స్  ఆశలపై  సూర్యకుమార్ యాదవ్ నీళ్లు చల్లాడు.   షమీ వేసిన 13 ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడిన బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను సూర్య కుమార్ డ్రాప్ చేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి  ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది.  అలెక్స్ హేల్స్ (81), జోస్ బట్లర్ (71)  ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 

4:22 PM IST

బట్లర్ హాఫ్ సెంచరీ..

సెమీఫైనల్లో భారత్ ను ఇంటికి పంపించడానికి  ఇంగ్లాండ్  రంగం సిద్ధం చేసింది.  ఫైనల్స్  లో పాకిస్తాన్ ను ఢీకొట్టేందుకు  సిద్దమవుతున్నది. భారత్ తో  జరుగుతున్న రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ విజయానికి చేరువలో ఉంది.  ఈ మ్యాచ్ లో 13 ఓవర్లు ముగిసేసరికి  ఇంగ్లాండ్..  వికెట్ నష్టపోకుండా 140  పరుగులు చేసింది. జోస్  బట్లర్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ హేల్స్.. 41 బంతుల్లోనే 80 పపరుగులతో ఆడుతున్నాడు.  ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవడానికి  7 ఓవర్లలో 29   పరుగులు చేయాల్సి ఉంది. 

4:11 PM IST

వంద దాటిన ఇంగ్లాండ్..

భారత బ్యాటర్లంతా కలిసి  చేసిన స్కోరును ఇంగ్లాండ్ ఓపెనర్లే చేసేట్టు కనబడుతున్నారు.  11  ఓవర్లు ముగిసేసరికి  ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్  (66)  హార్ధిక్ పాండ్యా వేసిన 11వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాది  ఇంగ్లాండ్ స్కోరును వంద దాటించాడు.  ఈ మ్యాచ్ లో విజయానికి చేరువగా వస్తున్న ఇంగ్లాండ్..  54 బంతుల్లో 61 పరుగులు చేయాలి. 

4:00 PM IST

హేల్స్ అర్థ సెంచరీ.. లక్ష్యం దిశగా ఇంగ్లాండ్

169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా సాగుతున్నది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ దాటిగా ఆడుతున్నారు. అక్షర్ పటేల్ వేసిన  8వ ఓవర్లో  సిక్సర్ బాదిన హేల్స్.. చివరి బంతికి సింగిల్ తీసి 28 బంతుల్లో  ఫిఫ్టీ కొట్టాడు.   9వ ఓవర్ వేసిన హార్ధిక్ పాడ్యా  బౌలింగ్ లో 7  పరుగులొచ్చాయి.  9 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (36), అలెక్స్ హేల్స్ (51) లు  క్రీజులో ఉన్నారు. 
 
3:47 PM IST

పవర్ ప్లే లో పవర్ ఫుల్ గా బాదిన ఇంగ్లాండ్

తొలి పవర్ ప్లే లో  ఇంగ్లాండ్ పవర్ ఫుల్ గా బాదింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ (28), అలెక్స్ హేల్స్ (33) లు బాదుడు మంత్రాన్ని పఠిస్తున్నారు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. తొలి పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేప్పటికీ ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఇంగ్లాండ్.. 84 బంతుల్లో 105 పరుగులు చేయాలి. 

3:42 PM IST

భారత్‌కు చుక్కలు చూపిస్తున్న హేల్స్..

మోస్తారు లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్ ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే బట్లర్ మూడు ఫోర్లు బాదగా తర్వాత  ఆ పనిని  అలెక్స్ హేల్స్ తీసుకున్నాడు. భువీ బౌలింగ్ లో సిక్సర్ బాదిన  హేల్స్.. మహ్మద్ షమీ వేసిన ఐదో  ఓవర్లో 6, 4 బాదాడు.   ఐదు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (24), అలెక్స్ హేల్స్ (26)  క్రీజులో ఉన్నారు. 

3:33 PM IST

3 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు..

అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో ఫోర్ కొట్టిన బట్లర్  తర్వాత  నెమ్మదించాడు. రెండో ఓవర్లో 8 పరుగులొచ్చాయి. భువనేశ్వర్ కుమార్ కూడా తన రెండో ఓవర్లోనూ విఫలమయ్యాడు. ఐదో బంతికి అలెక్స్ హేల్స్ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో 12 పరుగులే వచ్చాయి.  మూడు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ (13), జోస్ బట్లర్ (18)  ఆడుతున్నారు. 

3:23 PM IST

తొలి ఓవర్లోనే బట్లర్ బాదుడు..

169 పరుగుల లక్ష్య ఛేదనలో  ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. కెప్టెన్ జోస్ బట్లర్.. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్లో  13 పరుగులొచ్చాయి. జోస్ బట్లర్ (12), అలెక్స్ హేల్స్  ఆడుతున్నారు. 

3:07 PM IST

ముగిసిన భారత ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఇదే..

ఇండియా -ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న రెండో సెమీస్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (5) విఫలమవగా.. రోహిత్ శర్మ (27), సూర్యకుమార్ యాదవ్ (14) నిరాశపరిచారు. అడిలైడ్ కా బాద్షా  విరాట్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. చివర్లో హార్ధిక్ పాండ్యా (33 బంతుల్లో 63) మెరుపులు మెరిపించి భారత స్కోరును  160 మార్క్ దాటించాడు. చివరి ఓవర్లో పాండ్యా.. సిక్స్, ఫోర్ కొట్టాడు. చివరి బంతికి ఫోర్ కొట్టినా హిట్ వికెట్ అయి నిరాశగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంగ్లాండ్.. 20 ఓవర్లలో 169 పరుగులు చేయాలి. ఇండియా గెలవాలంటే ఆ లోపే ఇంగ్లాండ్ ను కట్టడి చేయాలి. మరి ఈ పోరులో గెలిచేదెవరు..? 

2:59 PM IST

19వ ఓవర్లో 20 పరుగులు

సామ్ కరన్ వేసిన  19వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. రెండో బంతికి రిషభ్ పంత్ ఫోర్ కొట్టగా.. నాలుగో బంతికి  పాండ్యా బౌండరీ బాదాడు. ఐదో బంతికి పాండ్యా.. భారీ సిక్సర్ కొట్టాడు. చివరి బంతికి కూడా నాలుగు పరుగులొచ్చాయి. దీంతో పాండ్యా 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19  ఓవర్లకు భారత్.. 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 

2:54 PM IST

పాండ్యా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు.. కోహ్లీ ఔట్

క్రిస్ జోర్డాన్ వేసిన  18వ ఓవర్లో   భారత్ 15 పరుగులు సాధించింది. హార్ధిక్ పాండ్యా రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఐదో బంతికి  కోహ్లీ..  స్క్వేర్ దిశగా రెండు పరుగులు తీసి ఫిఫ్టీ సాధించాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది నాలుగో ఫిఫ్టీ కావడం గమనార్హం.  అయితే తర్వాత బంతికే  కోహ్లీ.. అదిల్ రషీద్ కు క్యాచ్ ఇచ్చాడు.  18 ఓవర్లకు భారత్.. 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (37), రిషభ్ పంత్ ఆడుతున్నారు. 

2:46 PM IST

మిగిలింది మూడు ఓవర్లే..

16వ ఓవర్లో  10 పరుగులు సాధించిన భారత జట్టు.. సామ్ కరన్ వేసిన 17వ ఓవర్లో  11 పరుగులు చేసింది. తొలి బంతిని  హార్ధిక్ పాండ్యా సిక్సర్ గా బాదాడు. ఆ తర్వాత  ఐదు బంతుల్లో  ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి.   17 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 3 వికెట్ల నష్టానికి  121 పరుగులు చేసింది.  విరాట్ కోహ్లీ (48), హార్ధిక్ పాండ్యా (24) క్రీజులో ఉన్నారు.

2:42 PM IST

టీ20లలో కోహ్లీ అరుదైన ఘనత..

టీ20 క్రికెట్ లో కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఫార్మాట్ లో 4 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా  కోహ్లీ రికార్డులకెక్కాడు.  లివింగ్‌స్టోన్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టడం ద్వారా కోహ్లీ పరుగులు 4000 పరుగులు దాటాయి.  ఈ జాబితాలో  కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (3,853), మార్టిన్ గప్తిల్ (3,531), బాబర్ ఆజమ్ (3,323), స్టిర్లింగ్ (3,181) తదుపరి స్థానాల్లో ఉన్నారు.  

2:36 PM IST

వంద దాటిన టీమిండియా స్కోరు

టీమిండియా స్కోరు వంద దాటింది. లివింగ్‌స్టోన్ వేసిన  15వ ఓవర్లో కోహ్లీ చివరి బంతిని బౌండరీగా మలిచాడు. అంతకుముందు రెండో బంతికి కూడా పాండ్యా ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో భారత్ కు పది పరుగులొచ్చాయి.  దీంతో భారత స్కోరు 15 ఓవర్లకు వంద పరుగులు దాటింది. కోహ్లీ (43), హార్ధిక్ పాండ్యా (9) ఆడుతున్నారు. 

2:31 PM IST

14 ఓవర్లకు భారత్ స్కోరు..

హిట్ మ్యాన్,  సూర్యకుమార్ యాదవ్ ల నిష్క్రమణతో  ఢీలా పడ్డ భారత ఇన్నింగ్స్ నత్తకు నడక నేర్పుతున్నది.  14 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు.. 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేసింది.  విరాట్ కోహ్లీ (38), హార్ధిక్ పాండ్యా (4) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు మిగిలున్నవి ఇంకా  ఆరు ఓవర్లు మాత్రమే.. 

2:21 PM IST

సూర్య భాయ్ ఔట్.. కష్టాట్లో భారత్

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో  భారత్ భారీ ఆశలు పెట్టుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (14) తీవ్రంగా నిరాశపరిచాడు.  అదిల్ రషీద్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి  భారీ షాట్ ఆడిన సూర్య.. ఫిల్ సాల్ట్  చేతికి చిక్కాడు. దీంతో భారత్.. మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.  కోహ్లీ (29), హార్ధిక్ పాండ్యా (1) క్రీజులో ఉన్నారు. 

2:14 PM IST

పది ఓవర్లకు భారత్ స్కోరు 62-2

పది ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.  ఓపెనర్లు రోహిత్ శర్మ (27), కెఎల్ రాహుల్ (5) లు పెవిలియన్ చేరారు. వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (26), సూర్యకుమార్ యాదవ్ (3) లు ఆడుతున్నారు. వీరిమీదే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. సోషల్ మీడియాలో వీర్ - శూర్ (విరాట్ కోహ్లీ - సూర్యకుమార్) లు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఏం చేస్తారోనని టీమిండియా ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. 

2:08 PM IST

భారత్ కు భారీ షాక్.. కెప్టెన్ ఔట్

నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ లో మరో కుదుపు. టీమిండియా సారథి  రోహిత్ శర్మ (28 బంతుల్లో 27,  4 ఫోర్లు) ఔట్ అయ్యాడు.   క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్ ఐదో బంతికి  రోహిత్ భారీ షాట్ ఆడబోయి  లాంగాన్ లో సామ్ కరన్ చేతికి చిక్కాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (23), సూర్యకుమార్ యాదవ్ (1) ఆడుతున్నారు.

2:04 PM IST

8 ఓవర్లకు భారత స్కోరు..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు  రెండో ఓవర్లోనే  కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడంతో టీమిండియా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతోంది.   అదిల్ రషీద్ వేసిన 8వ ఓవర్ లో ఐదు పరుగులొచ్చాయి.  8 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. టీమిండియా మాజీ సారథి కోహ్లీ (22), ప్రస్తుత సారథి రోహిత్ శర్మ (23) లు ఆచితూచి ఆడుతున్నారు. 

1:57 PM IST

పవర్ ప్లే ముగిసేటప్పటికీ భారత స్కోరు ఇదే..

తొలి పవర్ ప్లే లో భారత బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది.  అదిల్ రషీద్ వేసిన తొలి పవర్ ప్లే చివరి ఓవర్లో తొలి బంతిని రోహిత్ శర్మ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో ఏడు పరుగులొచ్చాయి.  దీంతో పవర్ ప్లే ముగిసేటప్పటికీ భారత స్కోరు 6 ఓవర్లకు వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (20), విరాట్ కోహ్లీ (12) ఆచితూచి ఆడుతున్నారు. 

1:53 PM IST

హిట్ మ్యాన్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు..

నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ఊపు తెచ్చాడు.  సామ్ కరన్ వేసిన  ఐదో ఓవర్లో రోహిత్  తొలి రెండు బంతులను బౌండరీకి తరలించాడు.  మూడో బంతిని కూడా ఆఫ్ సైడ్ దిశగా గట్టిగానే బాదినా హ్యారీ బ్రూక్ అద్భుత ఫీల్డింగ్ తో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఐదు ఓవర్లకు భారత స్కోరు.. వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (11) క్రీజులో ఉన్నారు. 

1:50 PM IST

విరాట్ తొలి సిక్స్.. నెమ్మదిగా భారత బ్యాటింగ్

భారత బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది.  రెండో ఓవర్లోనే కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరడంతో  రోహిత్, కోహ్లీ ఆచితూచి ఆడుతున్నారు. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి  కోహ్లీ సిక్సర్ బాదాడు.  ఈ ఓవర్లో పది పరుగులొచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్.. 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. రోహిత్ (5), కోహ్లీ (10) క్రీజులో ఉన్నారు. 

1:45 PM IST

క్యాచ్ మిస్.. బతికిపోయిన కోహ్లీ..

కెఎల్ రాహుల్ నిష్క్రమణతో  క్రీజులోకి వచ్చిన  విరాట్ కోహ్లీ.. తృటిలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  సామ్ కరన్ వేసిన మూడో ఓవర్లో రెండో బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ కు తాకి స్లిప్స్ వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న మోయిన్ అలీ కి సమీపంలోనే అది పడటంతో కోహ్లీ బతికిపోయాడు. మూడు ఓవర్లు ముగిసేసిరికి భారత్.. 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. 

1:39 PM IST

కెఎల్ రాహుల్ ఔట్..

క్రిస్ వోక్స్ భారత్ ను తొలి దెబ్బ తీశాడు.  అతడు వేసిన రెండో ఓవర్లో  టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ (5) వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.  విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్.. ఒక వికెట్ నష్టానికి పది పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (4), కోహ్లీ (1) ఆడుతున్నారు. 

1:35 PM IST

తొలి ఓవర్లో..

ప్రధాన పేసర్లు గాయపడటంతో బెన్ స్టోక్స్  తో తొలి ఓవర్ వేయించాడు జోస బట్లర్.  స్టోక్స్ వేసిన మొదటి బంతికే బౌండరీ బాదిన  రాహుల్ తర్వాత బంతికి సింగిల్ తీశాడు.   నాలుగో బంతికి రోహిత్ సింగిల్ తో పరుగుల వేట మొదలుపెట్టాడు. తొలి ఓవర్ లో ఆరు పరుగులొచ్చాయి. 

1:20 PM IST

అడిలైడ్‌లో టాస్ గెలిచిన జట్టు గెలిచిందే లేదు..

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ - ఇండియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో సెమీస్‌లో జోస్ బట్లర్ సారథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయనుంది.  అయితే టీ20లలో టాస్ గెలిచిన టీమ్ మ్యాచ్  గెలిచినట్టు అడిలైడ్ చరిత్రలో లేదు. ఇప్పటివరకు 11 సార్లు టాస్ గెలిచిన జట్లు ఓటమిని మూటగట్టుకున్నాయి. మరి నేటి మ్యాచ్ లో కూడా అదే రిపీట్ కాబోతుందా..? 

1:11 PM IST

తుది జట్లు ఇవే..

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో  టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.  తుది జట్లు ఇవే.. 

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ 

ఇంగ్లాండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ 

1:05 PM IST

టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా బ్యాటింగ్..

భారత్ - ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న  రెండో సెమీస్ లో   జోస్ బట్లర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. గజ్జల్లో గాయం కారణంగా  బ్యాటర్ డేవిడ్ మలన్,  బాడీ స్టిఫ్‌నెస్ తో మార్క్ వుడ్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఫిల్ సాల్ట్, క్రిస్ జోర్డాన్ లు వారి స్థానల్లో ఆడుతున్నారు. భారత జట్టులో మార్పులే మీ లేవు.  గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఆడుతోంది. 

4:41 PM IST:

2022  టీ20 ప్రపంచకప్ లో చరిత్ర పునరావృతమైంది.  1992 వన్డే ప్రపంచకప్ లో  ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మధ్యే సెమీస్ జరిగింద. తిరిగి   ఈ ప్రపంచకప్ లో కూడా అవే ప్రత్యర్థులు మళ్లీ ఫైనల్ లో పోటీ పడబోతున్నాయి.  ఈనెల 13న మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్తాన్ లు తలపడతాయి.  మరి పాకిస్తాన్  మళ్లీ హిస్టరీ రిపీట్ చేస్తుందా..? లేక  బట్లర్ గ్యాంగ్  రెండో సారి ప్రపంచకప్ గెలుస్తుందా..? అనేది 13న తేలనుంది. 

4:34 PM IST:

బట్లర్ గ్యాంగ్ అనుకున్నంత పని చేసింది. రెండో సెమీస్ లో ఇండియాకు షాకిస్తామన్న ఇంగ్లాండ్.. చెప్పింది చేసి చూపించింది. సెమీఫైనల్ లో ఇండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా  ఛేదించింది. దీంతో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది.  ఫైనల్ లో  ఇంగ్లాండ్ - పాకిస్తాన్  తలపడుతాయి. 

4:29 PM IST:

మ్యాచ్ ఓడిపోతామని తెలిసినా ఒక్క వికెట్ అయినా  దక్కాలని చూస్తున్న టీమిండియా ఫ్యాన్స్  ఆశలపై  సూర్యకుమార్ యాదవ్ నీళ్లు చల్లాడు.   షమీ వేసిన 13 ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడిన బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను సూర్య కుమార్ డ్రాప్ చేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి  ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది.  అలెక్స్ హేల్స్ (81), జోస్ బట్లర్ (71)  ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 

4:22 PM IST:

సెమీఫైనల్లో భారత్ ను ఇంటికి పంపించడానికి  ఇంగ్లాండ్  రంగం సిద్ధం చేసింది.  ఫైనల్స్  లో పాకిస్తాన్ ను ఢీకొట్టేందుకు  సిద్దమవుతున్నది. భారత్ తో  జరుగుతున్న రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ విజయానికి చేరువలో ఉంది.  ఈ మ్యాచ్ లో 13 ఓవర్లు ముగిసేసరికి  ఇంగ్లాండ్..  వికెట్ నష్టపోకుండా 140  పరుగులు చేసింది. జోస్  బట్లర్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ హేల్స్.. 41 బంతుల్లోనే 80 పపరుగులతో ఆడుతున్నాడు.  ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవడానికి  7 ఓవర్లలో 29   పరుగులు చేయాల్సి ఉంది. 

4:11 PM IST:

భారత బ్యాటర్లంతా కలిసి  చేసిన స్కోరును ఇంగ్లాండ్ ఓపెనర్లే చేసేట్టు కనబడుతున్నారు.  11  ఓవర్లు ముగిసేసరికి  ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్  (66)  హార్ధిక్ పాండ్యా వేసిన 11వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాది  ఇంగ్లాండ్ స్కోరును వంద దాటించాడు.  ఈ మ్యాచ్ లో విజయానికి చేరువగా వస్తున్న ఇంగ్లాండ్..  54 బంతుల్లో 61 పరుగులు చేయాలి. 

4:00 PM IST:

169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా సాగుతున్నది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ దాటిగా ఆడుతున్నారు. అక్షర్ పటేల్ వేసిన  8వ ఓవర్లో  సిక్సర్ బాదిన హేల్స్.. చివరి బంతికి సింగిల్ తీసి 28 బంతుల్లో  ఫిఫ్టీ కొట్టాడు.   9వ ఓవర్ వేసిన హార్ధిక్ పాడ్యా  బౌలింగ్ లో 7  పరుగులొచ్చాయి.  9 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (36), అలెక్స్ హేల్స్ (51) లు  క్రీజులో ఉన్నారు. 
 
3:47 PM IST:

తొలి పవర్ ప్లే లో  ఇంగ్లాండ్ పవర్ ఫుల్ గా బాదింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ (28), అలెక్స్ హేల్స్ (33) లు బాదుడు మంత్రాన్ని పఠిస్తున్నారు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. తొలి పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేప్పటికీ ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఇంగ్లాండ్.. 84 బంతుల్లో 105 పరుగులు చేయాలి. 

3:42 PM IST:

మోస్తారు లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్ ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే బట్లర్ మూడు ఫోర్లు బాదగా తర్వాత  ఆ పనిని  అలెక్స్ హేల్స్ తీసుకున్నాడు. భువీ బౌలింగ్ లో సిక్సర్ బాదిన  హేల్స్.. మహ్మద్ షమీ వేసిన ఐదో  ఓవర్లో 6, 4 బాదాడు.   ఐదు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (24), అలెక్స్ హేల్స్ (26)  క్రీజులో ఉన్నారు. 

3:34 PM IST:

అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో ఫోర్ కొట్టిన బట్లర్  తర్వాత  నెమ్మదించాడు. రెండో ఓవర్లో 8 పరుగులొచ్చాయి. భువనేశ్వర్ కుమార్ కూడా తన రెండో ఓవర్లోనూ విఫలమయ్యాడు. ఐదో బంతికి అలెక్స్ హేల్స్ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో 12 పరుగులే వచ్చాయి.  మూడు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ (13), జోస్ బట్లర్ (18)  ఆడుతున్నారు. 

3:24 PM IST:

169 పరుగుల లక్ష్య ఛేదనలో  ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. కెప్టెన్ జోస్ బట్లర్.. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్లో  13 పరుగులొచ్చాయి. జోస్ బట్లర్ (12), అలెక్స్ హేల్స్  ఆడుతున్నారు. 

3:09 PM IST:

ఇండియా -ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న రెండో సెమీస్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (5) విఫలమవగా.. రోహిత్ శర్మ (27), సూర్యకుమార్ యాదవ్ (14) నిరాశపరిచారు. అడిలైడ్ కా బాద్షా  విరాట్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. చివర్లో హార్ధిక్ పాండ్యా (33 బంతుల్లో 63) మెరుపులు మెరిపించి భారత స్కోరును  160 మార్క్ దాటించాడు. చివరి ఓవర్లో పాండ్యా.. సిక్స్, ఫోర్ కొట్టాడు. చివరి బంతికి ఫోర్ కొట్టినా హిట్ వికెట్ అయి నిరాశగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంగ్లాండ్.. 20 ఓవర్లలో 169 పరుగులు చేయాలి. ఇండియా గెలవాలంటే ఆ లోపే ఇంగ్లాండ్ ను కట్టడి చేయాలి. మరి ఈ పోరులో గెలిచేదెవరు..? 

2:59 PM IST:

సామ్ కరన్ వేసిన  19వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. రెండో బంతికి రిషభ్ పంత్ ఫోర్ కొట్టగా.. నాలుగో బంతికి  పాండ్యా బౌండరీ బాదాడు. ఐదో బంతికి పాండ్యా.. భారీ సిక్సర్ కొట్టాడు. చివరి బంతికి కూడా నాలుగు పరుగులొచ్చాయి. దీంతో పాండ్యా 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19  ఓవర్లకు భారత్.. 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 

2:54 PM IST:

క్రిస్ జోర్డాన్ వేసిన  18వ ఓవర్లో   భారత్ 15 పరుగులు సాధించింది. హార్ధిక్ పాండ్యా రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఐదో బంతికి  కోహ్లీ..  స్క్వేర్ దిశగా రెండు పరుగులు తీసి ఫిఫ్టీ సాధించాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది నాలుగో ఫిఫ్టీ కావడం గమనార్హం.  అయితే తర్వాత బంతికే  కోహ్లీ.. అదిల్ రషీద్ కు క్యాచ్ ఇచ్చాడు.  18 ఓవర్లకు భారత్.. 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (37), రిషభ్ పంత్ ఆడుతున్నారు. 

2:46 PM IST:

16వ ఓవర్లో  10 పరుగులు సాధించిన భారత జట్టు.. సామ్ కరన్ వేసిన 17వ ఓవర్లో  11 పరుగులు చేసింది. తొలి బంతిని  హార్ధిక్ పాండ్యా సిక్సర్ గా బాదాడు. ఆ తర్వాత  ఐదు బంతుల్లో  ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి.   17 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 3 వికెట్ల నష్టానికి  121 పరుగులు చేసింది.  విరాట్ కోహ్లీ (48), హార్ధిక్ పాండ్యా (24) క్రీజులో ఉన్నారు.

2:42 PM IST:

టీ20 క్రికెట్ లో కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఫార్మాట్ లో 4 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా  కోహ్లీ రికార్డులకెక్కాడు.  లివింగ్‌స్టోన్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టడం ద్వారా కోహ్లీ పరుగులు 4000 పరుగులు దాటాయి.  ఈ జాబితాలో  కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (3,853), మార్టిన్ గప్తిల్ (3,531), బాబర్ ఆజమ్ (3,323), స్టిర్లింగ్ (3,181) తదుపరి స్థానాల్లో ఉన్నారు.  

2:36 PM IST:

టీమిండియా స్కోరు వంద దాటింది. లివింగ్‌స్టోన్ వేసిన  15వ ఓవర్లో కోహ్లీ చివరి బంతిని బౌండరీగా మలిచాడు. అంతకుముందు రెండో బంతికి కూడా పాండ్యా ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో భారత్ కు పది పరుగులొచ్చాయి.  దీంతో భారత స్కోరు 15 ఓవర్లకు వంద పరుగులు దాటింది. కోహ్లీ (43), హార్ధిక్ పాండ్యా (9) ఆడుతున్నారు. 

2:31 PM IST:

హిట్ మ్యాన్,  సూర్యకుమార్ యాదవ్ ల నిష్క్రమణతో  ఢీలా పడ్డ భారత ఇన్నింగ్స్ నత్తకు నడక నేర్పుతున్నది.  14 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు.. 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేసింది.  విరాట్ కోహ్లీ (38), హార్ధిక్ పాండ్యా (4) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు మిగిలున్నవి ఇంకా  ఆరు ఓవర్లు మాత్రమే.. 

2:23 PM IST:

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో  భారత్ భారీ ఆశలు పెట్టుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (14) తీవ్రంగా నిరాశపరిచాడు.  అదిల్ రషీద్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి  భారీ షాట్ ఆడిన సూర్య.. ఫిల్ సాల్ట్  చేతికి చిక్కాడు. దీంతో భారత్.. మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.  కోహ్లీ (29), హార్ధిక్ పాండ్యా (1) క్రీజులో ఉన్నారు. 

2:14 PM IST:

పది ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.  ఓపెనర్లు రోహిత్ శర్మ (27), కెఎల్ రాహుల్ (5) లు పెవిలియన్ చేరారు. వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (26), సూర్యకుమార్ యాదవ్ (3) లు ఆడుతున్నారు. వీరిమీదే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. సోషల్ మీడియాలో వీర్ - శూర్ (విరాట్ కోహ్లీ - సూర్యకుమార్) లు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఏం చేస్తారోనని టీమిండియా ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. 

2:11 PM IST:

నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ లో మరో కుదుపు. టీమిండియా సారథి  రోహిత్ శర్మ (28 బంతుల్లో 27,  4 ఫోర్లు) ఔట్ అయ్యాడు.   క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్ ఐదో బంతికి  రోహిత్ భారీ షాట్ ఆడబోయి  లాంగాన్ లో సామ్ కరన్ చేతికి చిక్కాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (23), సూర్యకుమార్ యాదవ్ (1) ఆడుతున్నారు.

2:04 PM IST:

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు  రెండో ఓవర్లోనే  కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడంతో టీమిండియా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతోంది.   అదిల్ రషీద్ వేసిన 8వ ఓవర్ లో ఐదు పరుగులొచ్చాయి.  8 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. టీమిండియా మాజీ సారథి కోహ్లీ (22), ప్రస్తుత సారథి రోహిత్ శర్మ (23) లు ఆచితూచి ఆడుతున్నారు. 

1:57 PM IST:

తొలి పవర్ ప్లే లో భారత బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది.  అదిల్ రషీద్ వేసిన తొలి పవర్ ప్లే చివరి ఓవర్లో తొలి బంతిని రోహిత్ శర్మ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో ఏడు పరుగులొచ్చాయి.  దీంతో పవర్ ప్లే ముగిసేటప్పటికీ భారత స్కోరు 6 ఓవర్లకు వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (20), విరాట్ కోహ్లీ (12) ఆచితూచి ఆడుతున్నారు. 

1:53 PM IST:

నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ఊపు తెచ్చాడు.  సామ్ కరన్ వేసిన  ఐదో ఓవర్లో రోహిత్  తొలి రెండు బంతులను బౌండరీకి తరలించాడు.  మూడో బంతిని కూడా ఆఫ్ సైడ్ దిశగా గట్టిగానే బాదినా హ్యారీ బ్రూక్ అద్భుత ఫీల్డింగ్ తో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఐదు ఓవర్లకు భారత స్కోరు.. వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (11) క్రీజులో ఉన్నారు. 

1:50 PM IST:

భారత బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది.  రెండో ఓవర్లోనే కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరడంతో  రోహిత్, కోహ్లీ ఆచితూచి ఆడుతున్నారు. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి  కోహ్లీ సిక్సర్ బాదాడు.  ఈ ఓవర్లో పది పరుగులొచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్.. 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. రోహిత్ (5), కోహ్లీ (10) క్రీజులో ఉన్నారు. 

1:45 PM IST:

కెఎల్ రాహుల్ నిష్క్రమణతో  క్రీజులోకి వచ్చిన  విరాట్ కోహ్లీ.. తృటిలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  సామ్ కరన్ వేసిన మూడో ఓవర్లో రెండో బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ కు తాకి స్లిప్స్ వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న మోయిన్ అలీ కి సమీపంలోనే అది పడటంతో కోహ్లీ బతికిపోయాడు. మూడు ఓవర్లు ముగిసేసిరికి భారత్.. 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. 

1:41 PM IST:

క్రిస్ వోక్స్ భారత్ ను తొలి దెబ్బ తీశాడు.  అతడు వేసిన రెండో ఓవర్లో  టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ (5) వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.  విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్.. ఒక వికెట్ నష్టానికి పది పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (4), కోహ్లీ (1) ఆడుతున్నారు. 

1:35 PM IST:

ప్రధాన పేసర్లు గాయపడటంతో బెన్ స్టోక్స్  తో తొలి ఓవర్ వేయించాడు జోస బట్లర్.  స్టోక్స్ వేసిన మొదటి బంతికే బౌండరీ బాదిన  రాహుల్ తర్వాత బంతికి సింగిల్ తీశాడు.   నాలుగో బంతికి రోహిత్ సింగిల్ తో పరుగుల వేట మొదలుపెట్టాడు. తొలి ఓవర్ లో ఆరు పరుగులొచ్చాయి. 

1:20 PM IST:

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ - ఇండియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో సెమీస్‌లో జోస్ బట్లర్ సారథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయనుంది.  అయితే టీ20లలో టాస్ గెలిచిన టీమ్ మ్యాచ్  గెలిచినట్టు అడిలైడ్ చరిత్రలో లేదు. ఇప్పటివరకు 11 సార్లు టాస్ గెలిచిన జట్లు ఓటమిని మూటగట్టుకున్నాయి. మరి నేటి మ్యాచ్ లో కూడా అదే రిపీట్ కాబోతుందా..? 

1:11 PM IST:

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో  టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.  తుది జట్లు ఇవే.. 

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ 

ఇంగ్లాండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ 

1:05 PM IST: