'యే ఇండియన్' అంటూ అభిమానితో పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ గొడవ.. వీడియో
Haris Rauf: 2024 టీ20 వరల్డ్ కప్ 2024 లో చెత్త ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆ జట్టు తీరు హాట్ టాపిక్ అవుతున్న సమయంలో పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ ఇటీవల అమెరికాలో ఓ అభిమానితో 'యే ఇండియన్' అంటూ గొడవ పడటం నెట్టింట వైరల్ గా మారింది.
Haris Rauf heated argument with Pakistani fan : 2024 టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి ఔట్ అయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ కప్ లో చెత్త ప్రదర్శనతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు నడుచుకుంటున్న తీరుకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ ఒకరు తన అభిమానిని అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేస్తూ గొడవపడ్డాడు. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడవపడ్డాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ వైరల్ గా మారింది.
గత ప్రపంచ కప్ లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ఘోర ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ వివాదం చెలరేగింది. యుఎస్ఏ, వారి చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో షాకింగ్ ఓటముల తరువాత ఐర్లాండ్ పై ఓదార్పు విజయాన్ని మాత్రమే ఆ జట్టు సాధించగలిగింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో హారీష్ రవూఫ్ అభిమానితో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో ఉంది. తీవ్ర ఆగ్రహానికి గురైన రవూఫ్ 'యే ఇండియన్ హోగా' అంటూ ఆ అభిమాని పై విరుచుకుపడ్డాడు. అయితే, తాను భారతీయుడు కాదనీ, 'పాకిస్తానీ హు' అని రిప్లై ఇచ్చాడు. అయితే, రవూఫ్ ను శాంతింపజేసి ఉద్రిక్తతను తగ్గించేందుకు అతని భార్య ప్రయత్నించినప్పటికీ పరిస్థితి మరింత ముదిరింది.
అభిమానుల పట్ల ఇలా ప్రవర్తించిన పాకిస్తాన్ క్రికెటర్ పై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానితో ఇలా నడుచుకోవడం తగదని పేర్కొంటున్నారు. రవూఫ్ సహనం కోల్పోయాడని కొందరు విమర్శిస్తుంటే, టీ20 ప్రపంచకప్ లో జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర ఒత్తిడి వాతావరణం, నిరాశను పరిగణనలోకి తీసుకుని మరికొందరు అతడిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 'టీ20 వరల్డ్ కప్ లో ఘోర అవమానం ఎదుర్కొన్న తర్వాత పాక్ ఆటగాళ్లు పిచ్చివాళ్లయ్యారు' అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. అలాగే, 'ఐసీసీ దయచేసి హారిస్ లాంటి ఆటగాడిపై నిషేధం విధించండి' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
41 బంతుల్లో 144 పరుగులు... 18 సిక్సర్లతో తుఫాను ఇన్నింగ్స్.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు