Asianet News TeluguAsianet News Telugu

కరోనా వచ్చినా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్..

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis)కు కరోనా నిర్ధారణ (Josh Inglis tests positive for coronavirus) అయ్యింది. అయినా ఆయన క్రికెట్ ఆడుతున్నారు. (Josh Inglis, who is playing cricket despite the coronavirus outbreak) కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇతర సభ్యులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Josh Inglis, who is playing cricket despite the coronavirus outbreak..ISR
Author
First Published Feb 2, 2024, 12:53 PM IST

Josh Inglis : కరోనా సోకితే అందరూ నీరసంగా అయిపోతారు. దీని కోసం హాస్పిటల్ లోనో లేకపోతే ఇంట్లోనో ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఎవరినీ కలవకుండా ఐసోలేషన్ లో ఉంటారు. పెద్దగా శారీరక శ్రమకు గురవకుండా, విశ్రాంతి తీసుకుంటారు. కరోనా నుంచి నెగిటివ్ వచ్చిన తరువాత సాధారణంగా జీవిస్తారు. కానీ ఓ క్రికెటర్ మాత్రం కరోనా సోకినా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు. గ్రౌండ్ లోకి వచ్చి క్రికెట్ కూడా ఆడారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రముఖ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి...

వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ 1-1 డ్రాగా ముగిసిన తర్వాత.. ఇప్పుడు రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. ఈరోజు మెల్‌బోర్న్‌లోని చారిత్రక క్రికెట్ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కరోనా సోకిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ కూడా ఆడుతున్నారు.

ఫాక్స్ క్రికెట్ ప్రకారం.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ ఇంగ్లిస్ మ్యాచ్‌కు ముందే కోవిడ్ సోకింది. కానీ మొదటి ODI నుంచి ఆయన వైదొలగలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న మ్యాచ్ లో ఆయన వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రొటోకాల్ ను పాటిస్తూ ఆడుతున్నారు. ఇతర సభ్యులకు దూరంగా ఉంటున్నారు. 

India vs England 2nd Test: నిరాశపర్చిన రోహిత్ శర్మ, లంచ్ బ్రేక్ కు భారత్ స్కోర్ 103 పరుగులు

ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ ను ఉపయోగిస్తున్నారు. తన నుంచి ఇతర క్రికెటర్లకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తున్నారు. అయితే జోస్ ఇంగ్లిస్ స్ఫూర్తిని క్రికెట్ అభిమానులు ఎంతో ప్రశంసిస్తున్నారు. ఆయనను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios