కరోనా ఉందా లేదా..? ఐదు నిమిషాల్లో తేలిపోతుంది

అమెరికాకు చెందిన అబోట్ ల్యాబరేటరీస్ అభివిద్ధి చేసిన ఈ ప్రక్రియను ఇప్పటికే అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మనిస్ట్ర్రేషన్  అనుమతించింది. అయితే ఈ ప్రక్రియ పూర్థిస్థాయి ఆమోందం మాత్రం లభించలేదని సదరు సంస్థ తెలిపింది.

New corona test could give results in just 5 minutes

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య అమెరికాలో ఎక్కువగా ఉంది. లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. చనిపోయే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.

ఈ క్రమంలో.. సదరు వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనే విషయం తేల్చేందుకు ఆధునిక పరికరాన్ని ఒకదానిని కనుగొన్నారు. కేవలం ఐదు నిమిషాల్లో వైరస్ ని గుర్తించేలా దీనిని తయారు చేయడం విశేషం.

Also Read వియత్నాంను చూసి నేర్చుకోవాలి.. చిన్నదేశమైనా..కరోనాని జయించింది...

అమెరికాకు చెందిన అబోట్ ల్యాబరేటరీస్ అభివిద్ధి చేసిన ఈ ప్రక్రియను ఇప్పటికే అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మనిస్ట్ర్రేషన్  అనుమతించింది. అయితే ఈ ప్రక్రియ పూర్థిస్థాయి ఆమోందం మాత్రం లభించలేదని సదరు సంస్థ తెలిపింది.

ప్రస్తుతానికి గుర్తింపు పొందిన ల్యాబ్ లలో అత్యవసర ప్రాతిపదికన కింద ఉపయోగించడానికి అనుమతి లభిస్తున్నట్లు పేర్కొంది. వచ్చేవారం నుంచి వీటిని ఉపయోగంలో తెచ్చే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

‘మాలిక్యూలాల్ పాయింట్-ఆఫ్ కేర్ టెస్ట్ గా పిలిచే ఈ ప్రక్రియలో కరోనా వైరస్ ని కేవలం ఐదు నిమిషాలలోనే గుర్తించే అవకాశం ఉంది. నెగిటివ్ ఫలితం రావడానికి మాత్రం 13 నిమిషాలు పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా... 

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే చైనా, ఇటలీ దేశాలను దాటేసిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా.. అమెరికాలో మొత్తం లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు గుర్తించారు.

ప్రస్తుతం టాప్‌లో ఉన్న యూఎస్‌లో 1,04,142 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క శుక్రవారం ఏకంగా 17 వేల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక అమెరికాలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న 300 మంది పైగా మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 1,695 చేరుకుంది.

Also Read కలకలం:బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్ లక్షణాలు...

కాగా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్‌, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడాలోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. దీనితో సుమారు 33 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇక డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీరి కోసం 2.2 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా.. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్మించాలని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్ని ట్రంప్ రంగంలోకి అదింపారు. ఇప్పటికే అన్ని మార్గాలను అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేత సౌధం.. ఆఖరి అస్త్ర్రంగా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని కూడా అమల్లోకి తీసుకువస్తోంది.

దీనిని చాలా అరుదుగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి దానిని అమలులోకి తీసుకువచ్చారంటే.. పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios