Asianet News TeluguAsianet News Telugu

వాహనదారులకు కొత్త రూల్స్.. బైక్ రిజిస్టర్ అవ్వాలంటే అవి కచ్చితంగా ఉండాల్సిందే!

అన్ని మోటారుబైక్‌లకు సేఫ్టీ పరికరాలు వెనుక చక్రంకి 'సారి(చీర) గార్డ్స్‌'గా, వెనక కూర్చున వారికి పట్టుకోవడాని హ్యాండ్‌హోల్డ్‌లు, ఫుట్‌రెస్ట్‌లు తప్పని సరి ఉండాలి అని తెలిపింది. ఈ భద్రతా లక్షణాలు లేని లగ్జరీ బైకుల డిజైన్లలో మార్పులు అవసరమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

new rules for bikers: Centre makes it mandatory to have handholds, saree guards for bikes
Author
Hyderabad, First Published Jul 25, 2020, 2:37 PM IST

కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రోడ్డు భద్రతకు, మోటారు వాహన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది, అన్ని మోటారుబైక్‌లకు సేఫ్టీ పరికరాలు వెనుక చక్రంకి 'సారి(చీర) గార్డ్స్‌'గా, వెనక కూర్చున వారికి పట్టుకోవడాని హ్యాండ్‌హోల్డ్‌లు, ఫుట్‌రెస్ట్‌లు తప్పని సరి ఉండాలి అని తెలిపింది.

ఈ భద్రతా లక్షణాలు లేని లగ్జరీ బైకుల డిజైన్లలో మార్పులు అవసరమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహనాల (ఏడవ సవరణ) నిబంధనలు 2020కు దీనిని తెలియజేసింది. తదనుగుణంగా కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989ను సవరించే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

సవరించిన నిబంధనల ప్రకారం
ద్విచక్ర వాహనాల తయారీదారులు బైక్ వెనుక చక్రం వైపు సారి(చీర) గార్డ్ లేదా డ్రైవర్ సీటు వెనుక హ్యాండ్‌హోల్డ్స్‌ ఉండేలా నిర్ధారించాలి. నిబంధనలలో పేర్కొన్న అవసరాలకు అనుగుణంగా బైక్ ఉండాలి. వాహనం రెండు వైపులా పిలియన్ రైడర్‌(బ్యాక్ సీట్)కు ఫుట్‌రెస్ట్‌లను అందించడంతో పాటు, తయారీదారులు వెనుక చక్రంలో రక్షణ పరికరాలను(సారి గార్డ్) అందించాలి.

2000 సంవత్సర  ప్రారంభం నుండి ఈ భద్రతా లక్షణాలను సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలలో పొందుపరిచినప్పటికీ, వాహన తయారీదారులు చాలా సంవత్సరాలుగా భద్రతా నిబంధనలు పాటించకుండా హై ఎండ్ వాహనాలను ఉత్పత్తి చేశారని న్యాయవాది సురేష్ సౌలి తెలిపారు.

also read  ఆటోమొబైల్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో వేతనాలు, ఇంక్రిమెంట్, ప్రమోషన్లు.. ...

"ఆర్‌టి‌ఓ కార్యాలయాలలో నమోదు చేయబడిన ఏదైనా వాహనం, హై ఎండ్ బైక్ కూడా పిలియన్ రైడర్‌(బ్యాక్ సీట్)ల కోసం ఈ భద్రతా లక్షణాలకు తప్పని సరి కట్టుబడి ఉండాలి. దీని అర్థం లగ్జరీ బైక్‌లకు వెనుక చక్రం దగ్గర హ్యాండ్‌హోల్డ్, రక్షణ పరికరం ఖచ్చితంగా ఉండాలి" అని న్యాయవాది సురేష్ సౌలి తెలిపారు.


ద్విచక్ర వాహనాల్లో భద్రతా నిబంధనలను తప్పనిసరి చేసిన 2018లో జారీ చేసిన సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని రిపోర్టులు తెలిపింది. "ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఎక్కువ భాగం సిఎమ్‌వి నిబంధనలలో సూచించిన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, కొన్ని లగ్జరీ బైక్‌లు ఈ లక్షణాలు లేకుండా తయారు చేస్తున్నారు.

సుదీర్ఘ ప్రయాణాలకు ఒంటరిగా వెళ్లాలనుకునే రైడర్‌ల అవసరాలను తీర్చడానికి లగ్జరీ బైక్‌లు రూపొందించారు. పిలియన్ రైడర్స్ (బ్యాక్ సీట్)పై కూర్చున్నప్పుడు వారికి సపోర్ట్ కోసం పట్టుకోవడానికి కోరుకుంటారు, "అని మోటారుబైక్ షోరూమ్ మేనేజర్ చెప్పారు. లగ్జరీ ద్విచక్ర వాహనాల్లో ఎవరికీ వెనుక చక్రంలో సారి(చీర) గార్డు రాలేదని ఆయన అన్నారు.

"తయారీదారులు ఇప్పుడు లగ్జరీ బైకుల మొత్తం రూపకల్పనను మార్చవలసి ఉంటుంది. దీనికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చు" అని ఆయన చెప్పారు. జనవరి 1, 2022 నుండి తయారైన ద్విచక్ర వాహనాల ఫుట్‌రెస్ట్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద సంబంధిత బిఐఎస్ స్పెసిఫికేషన్లు తెలియజేసే వరకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (ఎఐఎస్) లో పేర్కొన్న అవసరాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios