వర్షిణి సౌందరాజన్
| Current Status | Live |
|---|---|
| Nick Name | యాంకర్ వర్షిణి |
| Date Of Birth | April 6, 1994 |
| Age | 32 |
| Profession | నటి, యాంకర్ |
| Famous For | యాంకరింగ్ |
| Birthplace | హైదరాబాద్ |
Biography
యాంకర్‌గా, టెలివిజన్ నటిగా ప్రేక్షకులకు బాగా పరిచయమైన వర్షిణి సౌందరరాజన్.. తన గ్లామర్, యాంకరింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఉన్న అనుభవంతో బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన ముద్ర వేయాలని అడుగుపెట్టారు.
హైదరాబాద్ కి చెందిన యాంకర్ వర్షిణి సౌందరాజన్.. మోడలింగ్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి వచ్చింది. 2014లో విడుదలైన జాతీయ అవార్డు అందుకున్న తెలుగు చిత్రం ‘చందమామ కథలు’ ద్వారా వర్షిణి నటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘లవర్స్’, ‘బెస్ట్ యాక్టర్స్’, ‘నన్ను దోచుకుందువటే’, ‘జోడీ’, ‘మళ్లీ మొదలైంది’, ‘శాకుంతలం’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ వంటి సినిమాల్లో నటించారు. అయితే సినిమాల కంటే ఆమెకు అసలు పాపులారిటీ తీసుకొచ్చింది మాత్రం టెలివిజన్. ముఖ్యంగా ‘ఢీ’ డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా కనిపించడం ద్వారా వర్షిణికి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో రచ్చ చేసేందుకు వచ్చింది.