అదిత్ అరుణ్
| Current Status | Live |
|---|---|
| Nick Name | త్రిగుణ్ |
| Date Of Birth | June 8, 1990 |
| Age | 36 |
| Profession | నటన |
| Famous For | యాక్టింగ్ |
| Birthplace | చెన్నై |
Biography
తెలుగు సినిమాల్లో హీరోగా, నటుడిగా పరిచయమైన త్రిగుణ్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో కనిపించిన ఈ నటుడు ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వనున్నారు.
త్రిగుణ్ అసలు పేరు అరుణ్ ఈశ్వర్. ఆయన చెన్నైలో జన్మించారు. అయితే పాఠశాల విద్యను విశాఖపట్నంలో పూర్తి చేశారు. అనంతరం చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జర్నలిజం చదివారు. సినిమాల్లోకి రాకముందు థియేటర్, షార్ట్ ఫిల్మ్స్‌లో పనిచేశారు. 2009లో విడుదలైన ‘కథ’ సినిమాతో ఆయన జర్నీ మొదలైంది. ఆ తర్వాత తమిళంలో ‘ఇనిదు ఇనిదు’, ‘తనీర్ విధూతి’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘L7’, ‘మనసుకు నచ్చింది’, ‘24 కిస్సెస్’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘డియర్ మేఘ’, ‘WWW’, ‘కథ కంచికి మనం ఇంటికి’, ‘కొండ’, ‘ప్రేమదేశం’ వంటి చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు హీరోగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టి రచ్చ చేస్తున్నాడు.