గుండెబోయిన ఝాన్సీ
| Current Status | Live |
|---|---|
| Nick Name | సింగర్ ఝాన్సీ |
| Age | 23 |
| Profession | రైతు/ ఫోక్ సింగర్ |
| Famous For | ఫోక్ సింగర్ |
| Birthplace | సూర్యపేట |
| Hobbies | సింగింగ్ |
Biography
జానపద గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో అద్భుతంగా రాణించి ప్రధాన హౌస్‌లోకి అడుగుపెట్టారు. పాటతో పాటు వ్యవసాయ నేపథ్యం ఉన్న ఆమె ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
పాటలు, వ్యవసాయం
సూర్యపేటకు చెందిన సింగర్ ఝాన్సీ.. పీజీ పూర్తి చేశాక జాబ్ వైపు వెళ్లకుండా తన తండ్రికి సపోర్ట్ గా వ్యవసాయం చేస్తోంది. అయితే చిన్నప్పట్నుంచి సింగర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఫోక్ సింగర్‌గా రాణించారు. వ్యవసాయం పనులు చేస్తూ జానపద పాటలు పాడుతూ వాటిని యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యింది. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామనర్‌గా ఆమె అగ్నిపరీక్షలో పాల్గొని బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంపికైన తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది.