Krishnudu

అల్లూరి కృష్ణ

Current Status Eliminated
Nick Name కృష్ణుడు
Date Of Birth July 15, 1975
Age 51
Profession నటన
Famous For యాక్టింగ్‌
Birthplace చింతలపల్లి, ఆంధ్ర ప్రదేశ్‌

Biography

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. సినీ అనుభవం ఉన్న ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో తన అనుభవాన్ని ఆటలో ఎలా ఉపయోగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన కృష్ణుడు, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ట్రీని దున్నేద్దామనుకునే సమయంలోనే యాక్సిడెంట్‌ అయ్యింది. కాలుకు గాయమైంది. దీంతో లావైపోయాడు. ఆ తర్వాత నటుడిగా మారి మొదటి సినిమా, మనోడు, వీధి, షాక్‌, పార్టీ, పోకిరి, హ్యాపీడేస్‌, వాన, యువత, ఓయ్‌, ఆర్య 2, వంటి చిత్రాల్లో నటించాడు. `వినాయకుడు`లో హీరోగా నటించి మెప్పించాడు. ఇటీవల ఆయనకు గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10 షోతో మళ్లీ బిజీ కావాలనుకుంటున్నాడు.

© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited)