హోండా కొత్త మోడల్ కార్....21 వేలు చెల్లిస్తే చాలు...

వచ్చేనెలలో హోండా కార్స్ ఆవిష్కరించనున్న డబ్ల్యూఆర్-వీ కార్ల కొనుగోలు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కార్ల ప్రేమికులు రూ.21 వేలు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని డీలర్ షిప్‌ల వద్ద బుకింగ్స్ సాగుతున్నాయని హోండా కార్స్ తెలిపింది.

honda new modal wr-v pre launch bookings now open at just rs 21,000

న్యూఢిల్లీ: హోండా కార్స్ డబ్ల్యూఆర్-వీ కార్ల కొనుగోలుకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నూతన తరం డబ్ల్యూఆర్-వీ కారు కొనుగోలు చేయాలని భావించే వారు రూ.21,000 చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని హోండా కార్స్ ఇండియా తెలిపింది. 

దేశవ్యాప్తంగా తమ డీలర్ల వద్ద కార్ల బుకింగ్స్ ప్రారంభమైనట్లు పేర్కొన్నది. రెండేళ్ల క్రితం ఆవిష్కరించినప్పటి ఆదరణ వినియోగదారుల నుంచి లభిస్తుందని హోండా కార్స్ అంచనా వేస్తోంది. వచ్చేనెలలో విపణిలోకి డబ్ల్యూఆర్-వీ అడుగిడనున్నది. 

also read ఇండియాలో వోక్స్ వేగన్ కొత్త ఎస్‌యూ‌వి కార్ లాంచ్... ధర ఎంతంటే ?

మూడోతరం జాజ్ స్ఫూర్తిగా డబ్ల్యూఆర్-వీ కారు విపణిలోకి ప్రవేశించింది. క్యాబిన్‌తోపాటు పలు అప్‌డేట్లతో డబ్ల్యూఆర్-వీ అందుబాటులోకి రానున్నది. న్యూ రేడియేటర్ గ్రిల్లె విత్ హారిజొంటల్ స్లాట్లు, మోర్ ప్రామినెంట్ క్రోమ్ అడిషన్లతో రానున్నది.

honda new modal wr-v pre launch bookings now open at just rs 21,000

ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్స్, సీ-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ ఈ కారుకు రియల్ ప్రొఫైల్ కానున్నది. 1.2 లీటర్ల ఐ-వీటెక్ పెట్రోల్, 1.5 లీటర్ల ఐ-డీటెక్ డీజిల్ ఇంజిన్లు పూర్తిగా బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్నాయి.

also read వచ్చేనెలలో విపణిలోకి హోండా ‘డబ్ల్యూఆర్-వీ’.. సరికొత్త ఫీచర్లతో..

సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ఫీచర్ కూడా లభించనున్నది. డబ్ల్యూఆర్-వీతోపాటు హోండా కార్స్ విడుదల చేయనున్న న్యూ సిటీ కారు కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


ద్వితీయార్థంలో న్యూ క్రెటా ఎస్ యూవీ ఎగుమతులు
ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) కారు క్రెటా ఎగుమతులు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానున్నాయి. పలు అదనపు ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న క్రెటా కారు రెండు ఆఫ్రికా ఏనుగులతో సమానమైన బరువు కలిగి ఉంటుందని హ్యుండాయ్ కార్స్ ప్రొడక్షన్ డైరెక్టర్ ఎస్ గణేశ్ మణి తెలిపారు. 1.5 లీటర్ల డీజిల్, పెట్రోల్ ఇంజిన్లతోపాటు 1.4 లీటర్ల టర్బో సామర్థ్యంతోపాటు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా 3డీ ప్రింటింగ్ డిజైన్‌తో రూపుదిద్దుకున్నది ఈ క్రెటా. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios