విజయవాడలో స్పా ముసుగులో వ్యభిచారం.. 19 కేంద్రాలు సీజ్..
విజయవాడలో స్పా ముసుగులో వ్యభిచారం జరుగుందన్న సమాచారంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. 19 సెంటర్లను సీజ్ చేశారు.
విజయవాడ : విజయవాడ నగరంలోని కొన్ని స్పాలు, మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని శనివారం వెల్లడించారు. విజయవాడలో 200కు పైగా స్పా, మసాజ్ సెంటర్లు ఉన్నాయని డీసీపీ తెలిపారు.
కొన్ని స్పా, మసాజ్, ఫిట్నెస్, వెల్ నెస్, స్లిమ్మింగ్, హెల్త్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఆయా సెంటర్లపై వారంరోజులుగా నిఘా పెట్టామని అన్నారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలను శుక్రవారం రాత్రి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. దివ్య యూనిసెక్స్ యూటీ సెలూన్, గోల్డెన్ కోక్స్, నోవా వెల్ నెస్ ఫిట్ నెస్ సెంటర్లలో వ్యభిచారానికి సంబంధించిన కొన్ని వస్తువులు లభించినట్లు డీసీపీ తెలిపారు.
స్పా, మసాజ్ సెంటర్లకు డీసీపీ విశాల్ గున్ని స్ట్రాంగ్ వార్నింగ్..
పూర్తిస్థాయి విచారణ తర్వాత 19 కేంద్రాలను సీజ్ చేశామని, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న 18 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల యువతులను, ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారితో పాటు ఆరు కేంద్రాల నిర్వాహకులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. టాస్క్ ఫోర్స్ ఏడిసిపి కె. శ్రీనివాసరావు, ఏసీపీ ఖాదర్ బాషా పాల్గొన్నారు.
కాగా, గత వారం నుంచి స్పా, మసాజ్ సెంటర్లపై డీసీపీ విశాల్ గున్ని నేతృత్వంలో నిఘా పెట్టారు. నిన్న రాత్రి 20 బృందాలు
19 స్పా, మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ దాడులో ఆరుగురు నిందితులపై కేసులు నమోదు చేశారు. నిర్వాహకులు, ఇతర నిందితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. 3 స్పాలలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఆధారాలు దొరకడంతో వీటిని సీజ్ చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బయటి రాష్ట్రాలకు చెందిన 18 మంది బాధితులను రక్షించారు.విశాల్ గున్ని మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో ఏవైనా అనుమానాస్పద స్పాలు, మసాజ్ సెంటర్లు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ దాడులు మరో వారం పాటు కొనసాగుతాయన్నారు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా అన్ని కేంద్రాలను తనిఖీ చేస్తామన్నారు.