స్పా, మసాజ్ సెంటర్లకు డీసీపీ విశాల్ గున్ని స్ట్రాంగ్ వార్నింగ్..

ఎన్టీఆర్ జిల్లా : గత వారం నుంచి స్పా, మసాజ్ సెంటర్లపై డీసీపీ విశాల్ గున్ని నేతృత్వంలో నిఘా పెట్టారు.

First Published Oct 16, 2022, 9:30 AM IST | Last Updated Oct 16, 2022, 9:30 AM IST

ఎన్టీఆర్ జిల్లా : గత వారం నుంచి స్పా, మసాజ్ సెంటర్లపై డీసీపీ విశాల్ గున్ని నేతృత్వంలో నిఘా పెట్టారు. నిన్న రాత్రి 20 బృందాలు 19 స్పా, మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ దాడులో ఆరుగురు నిందితులపై కేసులు నమోదు చేశారు. నిర్వాహకులు, ఇతర నిందితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. 3 స్పాలలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఆధారాలు దొరకడంతో వీటిని సీజ్ చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బయటి రాష్ట్రాలకు చెందిన 18 మంది బాధితులను రక్షించారు.విశాల్ గున్ని మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో ఏవైనా అనుమానాస్పద స్పాలు, మసాజ్ సెంటర్లు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ దాడులు మరో వారం పాటు కొనసాగుతాయన్నారు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా అన్ని కేంద్రాలను తనిఖీ చేస్తామన్నారు.