Asianet News TeluguAsianet News Telugu

మేడికొండూరు గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలగడప అడ్డరోడ్డు వద్ద వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటనపై  సుమారు ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాధితులు చెప్పిన లక్షణాల ఆధారంగా పోలీసులు ఏడుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Police arrested seven suspects in gang rape incident at Medikonduru of Guntur
Author
Guntur, First Published Sep 13, 2021, 2:51 PM IST


గుంటూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలగడప అడ్డరోడ్డు వద్ద వివాహితపై గ్యాంగ్‌రేప్ చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.  ఈ నెల 8వ తేదీన రాత్రి సత్తెనపల్లి మండలానికి చెందిన భార్యభర్తలు బైక్ పై  ఓ వివాహనికి వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

also read:గుంటూరు జిల్లాలో దారుణం: బైక్ మీద వెళ్తుండగా ఆపి భర్తను కొట్టి, భార్యపై గ్యాంగ్ రేప్

ఈ కేసులో శాస్త్రీయ ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.పాలపగడ అడ్డరోడ్డు వద్ద భర్తను కొట్టి భార్యపై  గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు నిందితులు. బాధితులు  అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. 

ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో ఈ తరహ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. సీతానగరం పుష్కరఘాట్ వద్ద గ్యాంగ్ రేప్ ఘటనతో పాటు బీటెక్  విద్యార్ధిని రమ్య పై దాడి ఘటన తర్వాత  పాలగడప వద్ద వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటన ఆందోళన కల్గిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios