గోదావరి వరదతో దెబ్బతిన్న పోలవరం కాఫర్ డ్యామ్: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్

గోదావరి నదికి వచ్చిన  భారీ వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు లోయర్ కాఫర్ డ్యామ్ స్వల్పంగా దెబ్బతిందని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ చెప్పారు. గురువారం నాడు లోక్ సభలో ఈ విషయమై ఆయన ప్రకటన చేశారు. 

Polavaram cofferdam damage caused by Godavari floods: Gajendra Singh Shekhawa


న్యూఢిల్లీ: godavariనదికి వచ్చిన భారీ వరద కారణంగా పోలవరం ప్రాజెక్టు లోయర్ కాఫర్ డ్యామ్ స్వల్పంగా దెబ్బతిందని కేంద్ర జల్ శక్తి మంత్రి Gajendra Singh Shekhawat  చెప్పారు. Polavaram ప్రాజెక్టు పురోగతి పనులను నిరంతరం తాము తెలుసుకొంటున్నట్టుగా కేంద్ర మంత్రి షెకావత్ చెప్పారు.  పోలవరానికి దిగువన గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేవని గజేంద్ర షెకావత్ తేల్చి చెప్పారు.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు  వఃస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గజేంద్ర షెకావత్ తెలిపారు.  Dowleswaram బ్యారేజీ కెపాసిటీ 30 లక్షల క్యూసెక్కులేనన్నారు. 

భద్రాచలం నుండి భారీగా వరద నీరు పోలవరం ప్రాజెక్టకు  వద్దకు చేరడంతో పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ స్వల్పంగా దెబ్బతిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమన్వయంతో వరదలపై సరైన నిర్ణయాలు తీసుకోవడంతో అతి తక్కువ నష్టంతో బయట పడినట్టుగా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చెప్పారు. 

1986 లో వచ్చిన వరద కంటే ఈ దఫా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. గోదావరి నది భద్రాచలం వద్ద ఈ దఫా 70 అడుగులు దాటి ప్రవహించింది. దీంతో భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో పాటు గోదావరికి వచ్చిన వరదతో  గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ:ద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు కూడా గోదావరి జలంతో  నిండిపోయాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల వరకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని భయంతో గడిపారు. భారీ ఎత్తున వరద రావడంతో ముంపు గ్రామాల ప్రజలను రెండు రాష్ట్రాలు పునరావాస కేంద్రాలకు తరలించారు.

గోదావరి నదికి జూలై మాసంలోనే వరదలు రావడంతో రానున్న రోజుల్లో వరదల పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై కూడా పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనతో ఉన్నారు. గోదావరి నదికి ఈ ఏడాది జూలై మాసంలో 100 ఏళ్లలో రానంత స్థాయిలో వరదలు వచ్చినట్టుగా అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే ఆగష్టు, సెప్టెంబర్ మాసంలో ప్రతి ఏటా గోదావరి నదికి వరదలు వస్తాయి. అయితే ఇప్పటికే గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు దాదాపుగా నిండిపోయాయి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో గోదావరికి వరదలు వస్తే పరిస్థితి ఎలా అనే ఆందోళన కూడా ముంపు గ్రామాల ప్రజలను వెన్నాడుతుంది. అయితే రానున్న రోజుల్లో వచ్చే  వరదలను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. 

also read:టీడీపీ హయాంలో ఘోరమైన తప్పిదాలు.. రూ. 400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది: మంత్రి అంబటి రాంబాబు

ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వచ్చే వరదల సమయంలో ముంపు  ప్రజలు ఇప్పటి నుండే ఆందోళన చెందుతున్నారు. జూలైలో వచ్చిన వరదలకే తాము ముంపునకు గురయ్యామంటున్నారు. భవిష్యత్తులో వచ్చే వరదల నుండి తమకు కాపాడేందుకు ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios