ప్రకృతిని రేప్ చేసిన పాపం ఊరికేపోదు: రిషికొండను సందర్శించిన తర్వాత సీపీఐ నారాయణ

విశాఖలోని రిషికొండను  సీపీఐ జాతీయ  కార్యదర్శి  నారాయణ  ఇవాళ పరిశీలించారు . లగ్జరీ  భవనాలను  రిషికొండలో  నిర్మిస్తున్నారన్నారు.ఈ నిర్మాణాల  కోసం  ప్రకృతిలోని సహజ  సిద్దమైన  అందాలను  ధ్వంసం  చేశారన్నారు.
 

CPI  National  Secretary  Narayana  Serious  Comments  On  Rushikonda constructions

విశాఖపట్టణం: ప్రకృతిని రేప్  చేసిన  పాపం  ఊరికేపోదని  సీపీఐ  జాతీయ  కార్యదర్శి  నారాయణ  చెప్పారు. ఏపీ  హైకోర్టు  అనుమతితో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  శుక్రవారం నాడు  రిషికొండలో నిర్మాణాలను  పరిశీలించారు. అనంతరం ఆయన  విశాఖలో  మీడియాతో  మాట్లాడారు. 

రిషికొండను తాను ఏమైనా పేలుడు పదార్ధాలు  తీసుకెళ్తున్నానా  అని ఆయన  ప్రశ్నించారు.  తనను  రిషికొండకు వెళ్లకుండా పర్యాటక  శాఖ  ఎందుకు  అభ్యంతర  పెట్టిందో  అర్ధం  కాలేదన్నారు. తాను  కోర్టు ధిక్కరణ  పిటిషన్  దాఖలు  చేసిన  తర్వాతే  రిషికొండను  సందర్శించేందుకు  అనుమతిని  ఇచ్చారని  ఆయన గుర్తు  చేసుకున్నారు.చివరకు  తనను  ఒక్కరిని  మాత్రమే  పర్యాటక  శాఖ  అధికారులు  అనుమతించారన్నారు.  

రిషికొండలో  లగ్జరీ  విల్లాలు, రూమ్స్ , ఫంక్షన్ హాల్స్  నిర్మిస్తున్నారని  నారాయణ  చెప్పారు.జగన్  తన  ఇల్లును  ఎలా  కట్టుకున్నారో  రిషికొండలో  నిర్మాణాలు  కూడా  అంతే  స్థాయిలో  ఉన్నాయని ఆయన  తెలిపారు. సహజ సిద్దమైన  ప్రకృతి  అందాలను  రిషికొండ  కోల్పోతుందని  ఆయన  అభిప్రాయపడ్డారు. విలాసవంతమైన  భవనాల నిర్మాణాలతో  సహజసిద్దమైన  ప్రకృతి  అందాలను  చూడలేమన్నారు.సహజ సిద్దమైన  రిషికొండను  ధ్వంసం చేయడం  ఎందుకని ఆయన  అడిగారు.  సహజ వనరులు, పర్యావరణాన్ని నాశనం  చేయడమేనని  ఆయన  చెప్పారు. సహజ సిద్దమైన  అందాలను  పాడు  చేయడంతో  విశాఖ  అందాలు  దెబ్బతింటున్నాయని ఆయన  ఆరోపించారు. 50  ఎకరాల్లో  నిర్మాణాలు చేస్తున్నారన్నారు. రిషికొండలో  రిసార్ట్స్ నిర్మాణాలతో  వచ్చే  ఆదాయం  కోసం  కాంట్రాక్టర్లు చూస్తారన్నారు.  

also  read:హైకోర్టు అనుమతితో రిషికొండకు నారాయణ: ఆంక్షల మధ్య సీపీఐ నేత టూర్

రిషికొండలో  నిర్మాణాలను పరిశీలించేందుకు  ఎందుకు  అనుమతించలేదో  చెప్పాలని ఆయన  ప్రశ్నించారు. రహస్యంగా  ఉంచడం  వల్లే  అనేక  అనుమానాలు  వస్తున్నాయని నారాయణ  అభిప్రాయపడ్డారు. రిషికొండలో  నిర్మాణాలను  పరిశీలించేందుకు  వచ్చే వారిని  అనుమతిస్తే  ఎలాంటి  ఇబ్బందులు  ఉండవన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios