నెల్లూరు జిల్లాలో బంగారు నిక్షేపాలు: డ్రిల్లింగ్ పనులు వేగవంతం

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం మాసాయిపేటలో బంారు నిక్షేపాలు ఉన్నట్టుగా అధికారుల బృందం గుర్తించింది.  2 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ నిక్షేపాలను బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

Biological Survey Of India scientists found gold mines At Udagiri In Nellore district

నెల్లూరు:నెల్లూరు జిల్లా Udagiri మండలం Masaipet లో బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా అధికారుల బృందం గుర్తించింది.  ఐదు ప్రాంతాల్లో ఈ నిక్షేపాలున్నాయని బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

ఐదు ప్రాంతాల్లోని 46 నమూనాల సేకరించారు.ఈ నమూనాల్లో బంగారంతో పాటు రాగి నిక్షేపాలను అధికారులు గుర్తించారు. సుమారు 2 వేల హెక్టార్లకు పైగా ఈ నిక్షేపాలున్నాయని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో డ్రిల్లింగ్ పనులు కూడా చేయాలని భావించారు. బంగారం, రాగి, వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

also read:Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. వెండి ధ‌ర‌లు మాత్రం..!

అనంతపురం జిల్లాలోని రామగిరి మండలంలోని  బంగారం నిక్షేపాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల బంగారం నిక్షేపాలున్నాయని గతంలోనే శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. 2021 అక్టోబర్ మాసంలో శాస్త్రవేత్తల బృందం ఈ అంశాన్ని తేల్చి చెప్పింది.

అనంతపురం జిల్లాలోని రామగిరిలో బంగారు గనులున్నట్టుగా భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ నిర్ధారించింది.20001 సంవత్సరంలో బంగారం తవ్వకాలను నిలిపివేశారు. తమకు ఇక్కడ మైనింగ్ కు అనుమతి ఇవ్వాలని బీజీఎంఎల్ సంస్థ ధరఖాస్తు చేసింది. 

 కర్నూల్ జిల్లాలో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో కూడా సర్వే నిర్వహిస్తున్నారు. కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో వర్షాలు కురిస్తే వజ్రాలు లభ్యమౌతున్నాయి. తొలకరి వర్షాలు కురిసిన సమయంలో పొలాల్లో పలువురు వజ్రాల వేట కోసం అన్వేషిస్తారు. జొన్నగిరి, తుగ్గలి మండలాల్లో ఓ ప్రైవేట్ సంస్థ బంగారం సర్వే కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. తుగ్గలి మండలంలో కొంత భూమిని లీజుకు తీసుకొని ఓ సర్వే సంస్థ  సర్వే కార్యక్రమాలను చేపట్టింది.1500 ఎకరాల్లో బంగారం నిక్షేపాలున్నట్టుగా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. 2013 నుండి ఓ ప్రైవేట్ సర్వే సంస్థ తవ్వకాాలు చేపట్టింది. 

భారత్‌లో నిర్ధారించిన ప్రస్తుత బంగారం మైనింగ్‌ నిల్వల పరిమాణం 70.1 టన్నులు. ఇందులో 88 శాతం కర్ణాటకలోనే ఉన్నాయి. మరో 12 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు..  చాలా తక్కువ మొత్తం జార్ఖండ్‌లో కనుగొన్నారు.

1947లో పునఃప్రారంభించబడినప్పటి నుండి 2020 వరకు కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్‌ మైన్‌ దాదాపు 84 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మైన్‌ ప్రస్తుతం భారతదేశంలోని ఏకైక ముఖ్యమైన బంగారు ఉత్పత్తిదారుగా ఉంది. భారత్‌ తన మొత్తం పసిడి డిమాండ్‌లో 80 శాతంపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios