వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో.. నిజాలు నిగ్గుతేల్చండి : డీజీపీకి ఏపీ మహిళా కమీషన్ లేఖ
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది.
వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంపై ఏపీ మహిళా కమీషన్ (ap women's commission) సీరియస్ అయ్యింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. ఈ ఘటనలో త్వరగా నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీని కోరారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. మరోవైపు.. గోరంట్ల మాధవ్ తీరుపై ప్రతిపక్షాలతో పాటు మహిళా, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఏపీ వ్యాప్తంగా గత రెండ్రోజులుగా నిరసనకు దిగాయి. విశాఖలో తెలుగుదేశం మహిళా నేతలు గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అటు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్ద గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎంపీ మాధవ్ దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ.. ఆయనను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
మరోవైపు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని హిందూపురం ఎంపీ Gorantla Madhav ఆరోపించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న Obscene videoపై గురువారం నాడు స్పందించారు. Morphing చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాధవ్ ఆరోపించారు. ఈ వీడియో విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్ వివరించారు. ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని ఆయన ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.
ALso Read:మేం కుట్రలు చేసేంత సీన్ మాధవ్‌కి లేదు.. ఫోరెన్సిక్ పరీక్షల్లోనే తేలుతుంది : చింతకాయల విజయ్
తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నారన్నారు. ఈ విషయమై ఏ విచారణకైనా సిద్దమేనన్నారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి టెస్టుకు కూడా తాను సిద్దమేనన్నారు. ఓ వీడియోలో ఉన్నట్టుగా తనను మార్పింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ధైర్యముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తనను డ్యామేజీ చేయాలని చూస్తున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు. తనను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ కుట్ర చేసిందన్నారు. ఈ వీడియో వెనుక వాస్తవాలను తేల్చాలని తాను పోలీసులను కోరిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు.