Relations
ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం. భర్తపై ప్రేమ ఉంటే అతనిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అస్సలు చేయకూడదు. మాట్లాడి అర్థం చేసుకోవాలి.
ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం ముఖ్యం. భార్య తన ప్రవర్తనతో భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయదు.
నిజమైన భాగస్వామి తన కలలకు రెక్కలు తొడుగుతాడు. మంచి భార్య తన భర్త కెరీర్, వ్యక్తిగత ఆశయాలను గౌరవిస్తుంది, అండగా నిలుస్తుంది.
పోలికలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. భార్య తన భర్తను ఇతరులతో పోల్చకూడదు. వారిలో ఉన్న ప్రత్యేకతలను గుర్తించాలి.
ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం. మంచి భార్య తన భర్తను ఎప్పుడూ మోసం చేయదు, భావోద్వేగపరంగా గానీ, ఇతర మార్గాల్లో గానీ.
ప్రతి ఒక్కరికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. మంచి భార్య వాటిని ఎగతాళి చేయదు, బలంగా నిలుస్తుంది.
భర్తను కంట్రోల్ చేయాలని చూడకూడదు. తమ బంధానికి గౌరవం ఇస్తూ.. సమానంగా ఉంటూ, స్వేచ్ఛ ఇవ్వాలి.
ఫిర్యాదులు, నెగెటివ్ మాటలు సంబంధాన్ని చెరిపేస్తాయి. మంచి భార్య సంబంధాన్ని సానుకూలంగా ఉంచుతుంది, కష్టాల్లో ఓర్పు, అవగాహన చూపుతుంది.