Lifestyle

ఇండియాలో తొలి డబుల్ డెక్కర్ క్రూయిజ్ ఇదే

క్రూయిజ్ సీటింగ్ సామర్థ్యం

అజ్మీర్‌లోని అనాసాగర్ సరస్సులో భారతదేశపు తొలి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ క్రూయిజ్ ప్రారంభమైంది. సౌరశక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో 150 మంది కూర్చోవచ్చు. 

పర్యాటకులు ఎంజాయ్ చేయొచ్చు

అనాసాగర్ సరస్సులో పర్యాటకులకు ఇది కొత్త అనుభూతినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ క్రూయిజ్ ఇప్పుడు పర్యాటకులకు అందుబాటులో ఉంది. 

ఈ క్రూయిజ్ ప్రత్యేకత ఏమిటి?

ఈ క్రూయిజ్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది పూర్తిగా సోలార్ పవర్ తో నడుస్తుంది. ఇది పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది. 

హైటెక్ సౌకర్యాలు

రెండు అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ క్రూయిజ్‌లో ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలు, డిస్కో లైట్లు, కిచెన్, ప్రత్యేక బాత్రూమ్ సౌకర్యాలు ఉన్నాయి.

కేవలం రూ.300కే బుక్ చేసుకోవచ్చు

మొదటి అంతస్తులో డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉంది. రెండవ అంతస్తులో రూఫ్‌టాప్ సౌకర్యం ఉంది. పర్యాటకులు కేవలం రూ.300కి 45 నిమిషాల రైడ్‌ను ఆస్వాదించవచ్చు.

సెలబ్రేషన్స్ కోసం బుకింగ్

ఎవరైనా పుట్టినరోజు లేదా వివాహ విందు వంటి ప్రత్యేక సందర్భాన్ని నిర్వహించాలనుకుంటే దీన్ని బుక్ చేసుకోవచ్చు. దీని కేఫ్‌లో వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్, రాజస్థానీ వంటకాలు ఉంటాయి.

టైమింగ్స్ తెలుసా

క్రూయిజ్ ఉదయం 11.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు నడుస్తుంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని అందులో 16 సీసీటీవీ కెమెరాలు, 200 లైఫ్ జాకెట్లు, రెస్క్యూ బోట్ అందుబాటులో ఉంచారు.

పర్యాటకులను ఆకర్షించేందుకు

అజ్మీర్‌లోని అనాసాగర్ సరస్సు ఇప్పుడు కొత్త పర్యాటక కేంద్రంగా మారింది. ఇండియా నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి పర్యాటకులు రానున్నారు. 

Find Next One