Lifestyle
ఆచారణ్య చాణక్యుడు ఎక్కువ కాలం ఉండకూడని 5 ప్రదేశాలు చెప్పారు. అక్కడికి వెళ్లినా వీలైనంత తర్వగా వదిలివెళ్లిపోవాలట. మరి, ఆ ప్రదేశాలేంటో చూద్దాం...
గౌరవం, ఉపాధి, బంధువులు, విద్య లేని చోట, మంచి గుణాలు లేని ప్రజలు ఉన్న చోట ఎక్కువ కాలం ఉండకూడదు.
గౌరవం లేని చోట ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదని, అటువంటి ప్రదేశాన్ని సకాలంలో వదిలి వెళ్ళాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
ఉపాధి లేని చోట ఉండకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు, ఎందుకంటే అలా చేయడం వల్ల త్వరగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.
బంధువులు లేని చోట ఎక్కువ కాలం ఉండకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అలాంటి చోట ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు.
విద్యా వనరులు లేని చోట లేదా విద్య ప్రాముఖ్యత తెలియని చోట నివసించడం వ్యర్థం. అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్ళండి.
మంచి గుణాలు లేని ప్రజలు ఉన్న చోట నివసించకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు, ఎందుకంటే అలాంటి వారితో జీవించడం వల్ల మనమూ వారిలాగే అవుతాం.