Lifestyle

చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మంచిది

వాదనల్లో తల దూర్చొద్దు

మీకు సంబంధమేలేని గొడవ జరుగుతుంటే దాంట్లో అనవసరంగా తలదూర్చకండి. ఇది మీకు భవిష్యత్తులో ఎన్నో సమస్యలొచ్చేలా చేస్తుంది.

ప్రశంసల్లో నిగ్రహం

ప్రశంసలు అందుకున్నప్పుడు పొంగిపోకుండా.. మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. లేదని మీ గురించి మీరు గొప్పగా చెప్పుకుంటే అవమానం పాలవుతారు. 

చెడుగా మాట్లాడకండి

ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే మీరు వారికి సపోర్ట్ చేయకుండా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఈరోజు ఎవరినో విమర్శించేవాడు రేపు మిమ్మల్ని కూడా అనొచ్చు. 

పూర్తిగా తెలియకపోతే మాట్లాడకండి

ఒక దానిగురించి మీకు పూర్తిగా తెలియకపోతే మౌనంగా ఉండటమే మంచిది. కొంచెం కొంచెం తెలిసిన సమాచారంతో మాట్లాడితే పరువు పోతుంది. ఎవరికైనా హాని కలగొచ్చు. 

అర్థం చేసుకోలేని వ్యక్తులు

మీ భావాలను అర్థం చేసుకోలేనివారితో కూడా మాట్లాడి వేస్ట్. కాబట్టి ఇలాంటి వారితో మౌనంగా ఉండటమే మంచిది. వీరికి ఏం చెప్పినా మీ భావాలను అర్థం చేసుకోలేరు. 

సమస్యలను వినండి

ఒకరు తమ సమస్యల గురించి చెప్తుంటే ఓపికగా వినడం నేర్చుకోండి. వారి సమస్యకు పరిష్కారం దొరికే వరకు మౌనంగా ఉండండి. 

కోపంలో ప్రశాంతత

ఒకరు మీపై కోపంగా ఉన్నారని మీరు కూడా కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది వారి కోపాన్ని తగ్గించి తమ తప్పు తెలిసేలా చేస్తుంది. 

సంబంధం లేని విషయాల్లో నిశ్శబ్దం

ఒక సమస్య మీకు సంబంధించింది కాకపోతే దాని గురించి మీరు మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే అనవసరంగా మాట్లాడి అవమానానికి గురికాకండి.

అరుపులకు దూరంగా ఉండండి

ప్రతి విషయానికి అరిచి గోలపెట్టే వారికి దూరంగా ఉండటమే మేలు. అరవడం వల్ల ఇతరులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

తగని సందర్భాల్లో నిశ్శబ్దం

ఎవరి గురించైనా అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన వారి లక్షణం.

Find Next One