Health
జుట్టు ఆరోగ్యానికి సెలీనియం చాలా ముఖ్యం.
సెలీనియం తక్కువైతే జుట్టు విరిగిపోవడం, నెమ్మదిగా పెరగడం, జుట్టు రాలడం జరుగుతుంది.
జుట్టు ఆరోగ్యం కోసం తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే..
బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం ఉంటుంది. బ్రెజిల్ నట్స్‌లోని సెలీనియం వాపును తగ్గించి, తలపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ట్యూనా, సాల్మన్ లాంటి కొవ్వు చేపల్లో సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి.
గుడ్డులోని పచ్చసొనలో సెలీనియం ఉంటుంది. ఒక గుడ్డు నుంచి 15 మైక్రోగ్రాముల సెలీనియం లభిస్తుంది.
సెలీనియం ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
100 గ్రాముల చికెన్‌లో 25 మైక్రోగ్రాముల సెలీనియం ఉంటుంది. ఇది తలపై చర్మానికి, జుట్టుకు ఆరోగ్యాన్నిస్తుంది.
ఒక కప్పు తోటకూరలో 11 మైక్రోగ్రాముల సెలీనియం ఉంటుంది. తోటకూరను సూప్, సలాడ్, కూరగా వండుకుని తినొచ్చు.