చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ తింటారు. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ మొత్తం ఆరోగ్యానికి మంచిది.
ఓట్స్‌లో బీటా-గ్లూకాన్‌తో సహా ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇది జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చియా గింజలతో ఓట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.
ఓట్స్, చియా గింజలు ప్రోటీన్‌ను అందిస్తాయి. ముఖ్యంగా చియా గింజల్లో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.
ఓట్స్, చియా గింజలను ముందు రోజు రాత్రి నానబెట్టి.. తర్వాత ఉదయం తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
ఓట్స్ ఆరోగ్యకరమైన ప్రేగు బ్యాక్టీరియాను పోషించడంలో సహాయపడుతుంది. చియా గింజల్లో కరగని ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.
అర కప్పు రోల్డ్ ఓట్స్, 1 స్పూన్ చియా గింజలు, 1 కప్పు పాలు, అర కప్పు పెరుగు, అర స్పూన్ తేనె కలిపి తీసుకోండి.