Health
లవంగాల్లో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. ఇందులో యూజెనోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది.
కీళ్ల నొప్పుల వల్ల వచ్చే వాపును తగ్గించడానికీ, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి ప్రమాదాలను తగ్గించడానికీ లవంగం సహాయపడుతుంది.
లవంగం చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్లు, అలర్జీలను నివారించడానికి సహాయపడుతుంది.
ప్రతిరోజు పరగడుపున లవంగాలు తీసుకోవడం వల్ల చాలా జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దంతాల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
లవంగం పరగడుపున తీసుకుంటే రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.
ప్రతిరోజు లవంగం కలిగిన ఆహారం తింటే శరీరంలో క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
లవంగాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని యాంటీ వైరల్ గుణాలు శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి.
అజీర్తి సమస్యలకు లవంగం మంచి పరిష్కారం. దీనిలో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.