మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు వంటివి గుమ్మడి గింజల్లో ఉండటం వల్ల రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
విటమిన్ సి, ఇ, జింక్, యాంటీఆక్సిడెంట్లు గుమ్మడి గింజల్లో ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మంచి నిద్రకు సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తికి గుమ్మడి గింజలు తోడ్పడతాయి.
జింక్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు గుమ్మడి గింజల్లో ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి మంచిది.
రోజూ ఉదయాన్నే గుమ్మడి గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తక్కువ కేలరీలు, ఫైబర్ కలిగిన గుమ్మడి గింజలు ఆకలి తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
విటమిన్ సి, జింక్, సెలీనియం, ఐరన్ వంటివి గుమ్మడి గింజల్లో ఉండటం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది.