Food

ఈ బియ్యం కిలో రూ. 15,000.. వీటి స్పెషలేంటో తెలుసా

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం

ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యమేంటో తెలుసా? కిన్మెమై రైస్.ఈ బియ్యాన్ని జపాన్‌లో పండిస్తారు. ఈ పంట విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్పెషల్ బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కిన్మెమై రైస్ ప్రత్యేకత

కిన్మెమై రైస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తారు. ఈ రైస్ చాలా త్వరగా జీర్ణమవుతుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది. 

కిన్మెమై రైస్ రకాలు

కిన్మెమై  రైస్ లో ఎన్నో రకాలున్నాయి. కిన్మెమై బెటర్ వైట్, కిన్మెమై  బెటర్ బ్రౌన్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రపంచంలో ప్రీమియం టాప్ క్వాలిటీ వెరైటీగా అమ్ముతారు.

ఈ పంట ఎన్ని రోజులు

కిన్మెమై రైస్ సాగు కూడా మనం వాడే సాధారణ బియ్యంలాగే 3 నుంచి 5 నెలల్లో పండుతుంది. కానీ దీన్ని డిఫరెంట్ పద్దతిలో పండిస్తారు. 

కిన్మెమై రైస్లో ని పోషకాలు

కిన్మెమై రైస్ ఉడికిన తర్వాత పేటెంట్ డీవాక్సింగ్ జరుగుతుంది. దీనిలో బియ్యం నెమ్మదిగా రుబ్బి, వాటిచుట్టూ ఉన్న మైనపు పొరను తొలగిపోతుంది. దీంతో వీటిలో పోషకాలు అలాగే ఉంటాయి.

సులభంగా జీర్ణమవుతుంది

ఈ బియ్యం ఉడికినప్పుడు నీళ్లను సరిగ్గా పీల్చుకుంటుంది.దీంతో  రైస్ పై నుంచి నునుపుగా మారుతుంది. ఇది చాలా తొందరగా జీర్ణమవుతుంది. 

ఈ బియ్యం ప్రయోజనాలు

కిన్మెమై రైస్ ఆరోగ్యానికి చాలా మంచివి. సాంప్రదాయ బియ్యంతో పోలిస్తే వీటిలో 30% తక్కువ కేలరీలు, 32% తక్కువ చక్కెర ఉంటుంది. షుగర్, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం

కిన్మెమై రైస్ కిలో దాదాపుగా 15,000 రూపాయలుగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. 

డిమాండ్ ఎక్కడ ఎక్కువ

కిన్మెమై ప్రీమియం రైస్ అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. జపాన్, ఆసియా దేశాలు, అమెరికా, యూరప్‌లలో ఈ బియ్యానికి డిమాండ్ బాగా ఉంది.

Find Next One