Food
చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. దీనివల్ల ఈ సీజన్ లో దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తాయి.
అయితే కొన్ని ఆకుకూరలను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇందుకోసం ఏ ఆకు కూరలు తినాలంటే?
పాలకూరను చలికాలంలో ఖచ్చితంగా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా.. ఒంట్లో రక్తాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ఆవాల ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని విషపదార్థాలను తొలగించి ఇమ్యూనిటీని పెంచుతాయి.
చలికాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెంతికూర ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఇనుము, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
తోటకూర పోషకాలకు మంచి వనరు. ఇది పిత్తం, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీనిలో ప్రోటీన్లు, కాల్షియం, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని హెల్తీగా ఉంచుతాయి
బతువా ఆకు కూర యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇది శరీరంలోని విషాన్ని బయటకు పంపి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.