Lifestyle

వాడేసిన టీ పొడి ని జుట్టుకు పెడితే ఏమౌతుంది?

టీ పొడి పారేస్తున్నారా?

టీ తయారు చేసిన తర్వాత ఆ పొడిని దాదాపు అందరూ పారేస్తారు. కానీ, ఆ పొడిని మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చట. మొక్కల నుంచి జుట్టు వరకు వాడొచ్చు.

 

 

మొక్కలకు ఎరువు

మిగిలిన టీ పొడిలో నత్రజని , సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి మొక్కలకు ఎరువుగా పనిచేస్తాయి. మీరు దీన్ని ఎండబెట్టి నేరుగా కుండీలో వేయండి.

జుట్టుకు కండిషనర్‌గా వాడండి

టీ పొడిని వడకట్టిన తర్వాత దాన్ని మళ్ళీ నీటిలో మరిగించి ఆ నీటితో మీ జుట్టును కడగండి. ఇది సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. జుట్టును మెరిసేలా , మృదువుగా చేస్తుంది.

ముఖానికి స్క్రబ్‌గా వాడండి

ఉపయోగించిన టీ పొడిని కడిగి దాన్ని ముఖానికి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించి చర్మాన్ని మృదువుగా,  శుభ్రంగా చేస్తుంది.

దుస్తుల మెరుపు పెంచండి

ముదురు రంగు దుస్తుల మెరుపు చాలా త్వరగా మసకబారుతుంది. అలాంటప్పుడు టీ పొడి నీటిలో బట్టలను నానబెట్టి ఉంచండి, దీనివల్ల బట్టల మెరుపు పెరుగుతుంది. దుర్వాసన కూడా తొలగిపోతుంది.

పాత్రల శుభ్రపరచడంలో వాడండి

మిగిలిన టీ పొడితో పాత్రలు, సింక్,  స్టీల్ వస్తువులను శుభ్రం చేయవచ్చు. టీ పొడిని నేరుగా పాత్రలు, సింక్ లేదా స్టీల్ ఉపరితలంపై వేసి దాన్ని రుద్ది శుభ్రం చేసుకోండి.

కళ్ళ వాపును తగ్గించండి

ఉపయోగించిన టీ బ్యాగ్‌ను మీరు ఫ్రిజ్‌లో ఉంచి దాన్ని మీ కళ్ళ కింద ఉంచండి. దీనివల్ల నల్లటి వలయాలు, కళ్ళ వాపు తగ్గుతుంది.

కీటకాలను దూరం చేయండి

టీ పొడిలో చీమలు,  కీటకాలు పారిపోయేలా చేసే గుణాలు ఉంటాయి. మీరు టీ పొడిని ఎండబెట్టి మూలల్లో చల్లండి లేదా దాని నీటిని కీటకాలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయండి.

నేల శుభ్రపరచడం

టీ పొడి అద్భుతమైన శుభ్రపరిచే ఏజెంట్‌గా పనిచేస్తుంది. మీరు టీ పొడి నీటిని పోచ నీటిలో కలిపి నేలను శుభ్రం చేయండి, దీనివల్ల నేల మెరిసేలా , శుభ్రంగా ఉంటుంది.

Find Next One