Food
కిస్ మిస్ లల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ ను రోజూ తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పరిగడుపున కిస్ మిస్ వాటర్ ను తాగితే మీ శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు.
ఆడవారికి ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్లు ఇనుము, రాగి, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉండే కిస్ మిస్ వాటర్ ను రోజూ తాగితే ఈ సమస్య నుంచి బయటపడతారు.
కిస్ మిస్ వాటర్ లో విటమిన్ సి, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ ను రోజూ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కిస్ మిస్ వాటర్ లో కాల్షియం, బోరాన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ వాటర్ ను రోజూ తాగితే మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉండే కిస్ మిస్ వాటర్ ను రోజూ తాగితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
ఏదేమైనా ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.