Entertainment
నటి అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్‌తో తనకున్న బంధం, పరస్పర గౌరవం గురించి మొదటిసారిగా ఓపెన్ అయ్యారు.
వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఐక్యత, సామరస్యాన్ని సూచించే విధంగా "మేము ఒకే సూర్యుని క్రింద ఉంటాం` అని తెలిపారు అదితి.
అదితి తన వ్యక్తిగత, వృత్తి జీవితంలో సిద్ధార్థ్ ఒక ప్రోత్సాహక శక్తి అని గర్వంగా చెప్పారు.
వారు ఇద్దరూ సాధారణ సంతోషకరమైన క్షణాలను కూడా ఎలా అర్థవంతంగా మలుచుకుంటారో వెల్లడించారు అదితి.
ఒకరినొకరు ప్రత్యేకంగా గౌరవించుకోవడానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఇది తమ మధ్య ప్రేమ పెరగడానికి కారణమవుతుందన్నారు.
వీరి అవగాహన, అభిమానులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. ఇది వారి ప్రేమని కొత్త కోణంలో, అదే సమయంలో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉండటం విశేషం.