business

80 వేల సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోని 10 పురాతన వృక్షాలు

చెట్ల ప్రపంచం చాలా విచిత్రమైనది. భూమిపై ఉన్న 10 పురాతన వృక్షాల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి. 

మెతుసెలా (Methuselah)

కాలిఫోర్నియా, USAలోని గ్రేట్ బేసిన్ బ్రిస్టల్‌కోన్ పైన్ చెట్టు ఇది. దాదాపు 4,855 సంవత్సరాల పురాతనమైనది.

అలెర్స్ మిలెనారియో

చిలీలోని పటగోనియన్ సైప్రస్ చెట్టు ఇది. ఈ చెట్టు వయస్సు 2,400 నుండి 5,484 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా.

ప్రోమేతియస్

వీలర్ పీక్, నెవాడా, USAలో 1964లో ఒక పరిశోధకుడు ఈ చెట్టును నరికివేశాడు. దీనిలో 4,862 రింగులు లెక్కించారు. అంటే ఈ చెట్టు వయస్సు 4,900 సంవత్సరాలు.

సర్వ్-ఎ అబర్కు

ఇరాన్‌లోని సైప్రస్ చెట్టు కనీసం 4,000 సంవత్సరాల పురాతనమైనది. ఇది ఆసియాలోని పురాతన వృక్షాల్లో ఒకటి.

ఓల్డ్ రాస్మస్

సోన్‌ఫ్జెల్లెట్ నేషనల్ పార్క్, స్వీడన్‌లోని నార్వే స్ప్రూస్ చెట్టు 9,500 సంవత్సరాల పురాతనమైంది. 

 

అలెర్స్ చెట్టు

చిలీలోని అలెర్స్ చెట్టు వయస్సు దాదాపు 3,600 సంవత్సరాలు.

టే మటువా న్గాహెరే

వైపౌవా ఫారెస్ట్, న్యూజిలాండ్‌లోని కౌరి చెట్టు వయస్సు 1,500 నుండి 2,500 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీన్ని "అడవి పిత" అని పిలుస్తారు.

పాండో

ఉతా, USAలోని క్వేకింగ్ ఆస్పెన్ కాలనీలో ఉన్న పాండో చెట్టు 80,000 సంవత్సరాల కంటే పురాతనమైంది.

లాంగెర్న్యూ యూ

సెయింట్ డిగెన్ పారిష్ చర్చి చర్చియార్డ్‌లో ఉన్న ఈ చెట్టు కనీసం 4 వేల నుండి 5 వేల సంవత్సరాల పురాతనమైంది. 

ఓల్డ్ టిజిక్కో

నార్వే స్ప్రూస్, దాదాపు 9,560 సంవత్సరాల పురాతనమైన ఈ చెట్టు ఫులుఫ్జెల్లెట్ నేషనల్ పార్క్, స్వీడన్‌లో ఉంది.

జోమోన్ సుగి

యాకుషిమా ద్వీపం, జపాన్‌లోని క్రిప్టోమెరియాలో ఉన్న చెట్టు వయస్సు 2,170 నుండి 7,200 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా. 

Find Next One