business
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పేదలకు ఎంతో లాభదాయకం. తక్కువ ప్రీమియంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుతుంది.
ఈ పథకంలో భాగంగా ప్రతి నెలా ఒక రూపాయి ప్రీమియం చెల్లించిన వారికి రెండు లక్షల రూపాయల వరకు రిస్క్ కవర్ లభిస్తుంది. ఇది ప్రభుత్వం అందించే అత్యంత చౌకైన యాక్సిడెంటల్ బీమా పథకం.
జీవితంలో ప్రమాదాలు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేం. అలాంటి సమయంలో పేదలకు వైద్య ఖర్చులు భారమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి తీసుకొచ్చిన ఈ పథకం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
PMSBY ఖాతా నుండి ప్రతి నెలా ఒక రూపాయి ప్రీమియం ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. ఈ బీమా జూన్ నుండి మే వరకు ఒక సంవత్సరం పాటు వర్తిస్తుంది.
PMSBY పథకం కింద బీమా చేసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది.