business
స్పేస్ఎక్స్ కు చెందిన అమెరికన్ రాకెట్ ఫాల్కన్ 9 పాక్షికంగా తిరిగి ఉపయోగించగల రాకెట్. దీన్ని 2018లో మొదట ఉపయోగించారు.
ఫాల్కన్ రాకెట్ దాదాపు 393 ప్రయోగాల్లో పాల్గొంది. కేవలం నాలుగు సార్లు మాత్రమే ఫెయిల్ అయ్యింది. ఈ రాకెట్ సక్సెస్ రేట్ 99 శాతం.
ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఒక ప్రత్యేక ప్రయోగం ఖర్చు సగటున 70 మిలియన్ డాలర్లు.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 ముఖ్య లక్షణం ఏమిటంటే దీన్ని తిరిగి ఉపయోగించవచ్చు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్బిటల్-క్లాస్ పునర్వినియోగ రాకెట్.
ఫాల్కన్ 9 రాకెట్ 349 స్టేజస్ ల్యాండింగ్లను చేసింది. రాకెట్ ఫస్ట్ స్టేజ్ పనిని పూర్తి చేసిన తర్వాత తిరిగి దాని ప్లేస్ కి తిరిగి వస్తుంది.
2021లో ఫాల్కన్ 9 ఒకే మిషన్లో 143 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. 2017లో ఇండియాకు చెందిన PSLV ఒకే మిషన్లో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది.
2024లో ఫాల్కన్ 9 ఇప్పటికే 106 ప్రయోగాలు చేసింది. ఈ ఏడాది మొత్తం 148 ప్రయోగాలను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యం. ఇదే జరిగితే రికార్డుల్లో నిలుస్తుంది.