ఆలూ చిప్స్, ఐస్ క్రీంలు తినడం డ్రగ్స్ లాంటి వ్యసనమే.. తాజా పరిశోధనలో షాకింగ్...

By SumaBala BukkaFirst Published Oct 19, 2023, 12:19 PM IST
Highlights

ఆలూ చిప్స్, ఐస్ క్రీంలు తినే అలవాటు డ్రగ్స్ లాంటి వ్యసనమే అని ఓ తాజా అధ్యయనం తేల్చింది. 36 వేర్వేరు దేశాల్లో జరిపిన 281 అధ్యయనాలను పరిశీలించి ఈ నివేదికను వెల్లడించింది. 

మీకు ఐస్ క్రీం, ఆలూ చిప్స్ అంటే ఇష్టమా? కొద్ది రోజులు తినకపోతే..క్రేవింగ్స్ వస్తుంటాయా? అయితే ఇది ప్రమాదకరమే. వీటికి అలవాటు పడడం.. డ్రగ్స్  కు అలవాటు పడడంతో సమానమట. ఇటీవల జరిగిన ఓ పరిశోధన ఈ విషయాన్ని తేల్చింది. 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది జంక్ ఫుడ్ ను మానేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఆలు చిప్స్, ఐస్ క్రీం లాంటివి తినకుండా ఉండాలని ట్రై చేస్తుంటారు.. కానీ ఫలించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? అనే అంశం మీద ఆహార నిపుణులు, పరిశోధకులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. 

డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ: ఆస్తుల కేసులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

ఈ పరిశోధనల్లో భాగంగానే శాస్త్రవేత్తలు అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా యూపీఎఫ్ లు డ్రగ్స్ లాగా వ్యసనపరులుగా మార్చేస్తాయని కనిపెట్టారు. యూపీఎఫ్ లు అనారోగ్యకరమైనవి, అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి. 36 దేశాల నుండి 281 అధ్యయనాలపై ఇటీవల జరిపిన అధ్యయనంలో 14% మంది ప్రజలు యూపీఎఫ్ లకు బానిసలుగా ఉన్నారు.ఇది చాలా తీవ్రమైన సమస్య ఎందుకంటే మన ఆహారంలో యూపీఎఫ్ లు సర్వ సాధారణం.

సాసేజ్‌లు, ఐస్ క్రీం, బిస్కెట్లు, శీతల పానీయాలు, చక్కెర తృణధాన్యాలు వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు క్యాన్సర్, మానసిక క్షోభ, అకాల మరణాలతో సహా అనేక ప్రతికూల ఆరోగ్య ఫలితాలను కలిగిస్తాయని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యాష్లే గేర్‌హార్డ్ట్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. 

గేర్ హార్డెట్ ఆమె తోటి పరిశోధకులు ది బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన తమ కొత్త పరిశోధనలలో ఇలా పేర్కొన్నారు, "యూపీఎఫ్ లలో తరచుగా కనిపించే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వుల కలయిక మెదడు రివార్డ్ సిస్టమ్‌లపై  ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది, ఇది మాక్రోన్యూట్రియెంట్ మాత్రమే కంటే ఎక్కువగా ఉండి... ఈ ఆహారాలు వ్యసనంగా మారేలా చేస్తుంది’’ అని తెలిపారు.

ది గార్డియన్ ప్రకారం, సమీక్ష ప్రధాన రచయిత, మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆష్లే గేర్‌హార్డ్, సమస్యను అంచనా వేయడానికి 2009లో యేల్ ఫుడ్ అడిక్షన్ స్కేల్‌ను రూపొందించారు. ఆమె చెబుతూ.. "నేను ఆల్కహాల్, నికోటిన్, కొకైన్, హెరాయిన్ లాంటివాటినుంచి..  ప్రామాణిక రోగనిర్ధారణ ప్రమాణాలను తీసుకున్నాను. వాటిని ఆహారానికి అన్వయించాను" అని ఆమె వివరిస్తుంది.

ఈ ప్రమాణాలలో ముఖ్యంగా అధికంగా తినాలనుకోవడం.. వినియోగంపై నియంత్రణ కోల్పోవడం, కోరికలు, ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ నిరంతర వినియోగం..ఉపసంహరణ వంటివి ఉన్నాయి. ఒక వ్యక్తి గత సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉంటే ఇది బలహీనతగా,  ఆహార వ్యసనంగా మారినట్లు గుర్తించబడుతుందన్నారు. 

click me!