ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయం అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలో వ్యవసాయ మంత్రి కన్నబాబు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమరావతి: వచ్చేఏడాది జనవరి 17వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల ప్రారంభించనున్నట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ తేదీనాటికి 3300 రైతు భరోసా కేంద్రాలను, ఫిబ్రవరిలో మరో 5వేల కేంద్రాలు, ఏప్రిల్ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారులు పనులు చేపట్టాలని సూచించారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో జగన్ సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
undefined
సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయరంగంలో వినియోగించే ఉత్పత్తలను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు అమ్మాలని సూచించారు. అలాగే రైతులకు సలహాలు, శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందిస్తున్న వివిధ పథకాలను సక్రమంగా అందించడంలో కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.
రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ దిగుబడులను పెంచడం, రైతులకు ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. ఈ కేంద్రాలు దశలవారీగా విత్తన పంపిణీ, ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లగా కూడా వ్యహరించనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రంలో తమకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులను ఆర్డర్ ఇవ్వడానికి రైతులు డిజిటల్ కియోస్క్ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
read more యువతకు ఉద్యోగావకాశాలు... విశాఖ, తిరుపతి లలో ప్రత్యేక యూనివర్సిటీలు
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోఫెర్టిలైజర్స్, అగ్రి కెమికల్స్, పశుదాణా ఇతరత్రా ఉత్పత్తుల ఆర్డర్ కియోస్క్ ద్వారానే అందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి ముందు సీఎం డిజిటల్ కియోస్క్‌ను కూడా పరిశీలించారు.
రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న భూసార పరీక్ష పరికరాలను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. విత్తనాల తయారీదారులు కూడా నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాత రైతు భరోసా కేంద్రాలకు పంపించాలన్నారు. విత్తనాలు నిల్వచేసే గోడౌన్లలో కూడా నాణ్యతా పరీక్షలు చేయాలని....జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు కూడా పరీక్షలు చేయాలన్నారు.
ఆక్వాఫీడ్ నాణ్యతపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో ఆక్వాఫీడ్ నాణ్యతపై ప్రమాణాలు నిర్దేశిస్తూ త్వరలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు మాత్రమే తమ విత్తనాలను, పురుగు మందులను, ఎరువులను విక్రయించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
దీనివల్ల కల్తీకి చెక్ పడుతుందన్నారు. ప్రస్తుతమున్న ల్యాబ్‌లను ప్రభుత్వం పెంచుతున్నందున కల్తీని అడ్డుకునే పనులు ముమ్మరంగా కొనసాగుతాయని అధికారులు సీఎం కు తెలిపారు.
ap capital: సచివాలయం వద్ద టిడిపి, వైసిపి వర్గాల ఘర్షణ
ప్రభుత్వం అంటే అవినీతి ఉంటుందని, తక్కువ నాణ్యత ఉన్నవాటిని ఇస్తారని ఒక అభిప్రాయం రైతుల్లో ఉందని...దీన్ని ఇప్పుడు మార్చబోతున్నట్లు సీఎం తెలిపారు.
అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించాలని... అంతేకాక రైతులకు ఇచ్చే విత్తనాలు, పురుగుమందుల్లో నాణ్యత ఉండేలా గట్టిగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు.
గోడౌన్లలో ఉన్నప్పుడు విత్తనాలు కల్తీ జరక్కుండా సరైన నిల్వ పద్ధతులు పాటించాలన్నారు. కల్తీ జరగని విధంగా సంచుల నాణ్యత ఉండాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, వెటర్నరీ ఉద్యోగులు రైతు భరోసా కేంద్రాలనుంచే విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే పంటలకు బీమా సదుపాయం కూడా రైతు భరోసా కేంద్రాలనుంచే అందివ్వాలని జగన్ సూచించారు.
వివిధ వ్యవసాయ ఉత్పత్తలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాల జాబితా రైతు భరోసా కేంద్రంలో డిస్‌ప్లే చేయాలన్నారు.పంటలు, సాగు విధానాలపై డిజిటల్ సమాచారాన్ని రైతు భరోసా కేంద్రంలో ఉంచాలని... అలాగే వెదర్ స్టేషన్స్ కూడా రైతు భరోసా కేంద్రంలో పెట్టాలన్నారు. వాతావరణ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలని, అంతరాయంలేని విధంగా ఇంటర్నెట్ ఉండేలా చూసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశించారు.