Apr 9, 2020, 10:24 AM IST
లాక్ డౌన్ ను అడ్డం పెట్టుకొని,సిరిసిల్ల లో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, సిరిసిల్ల మున్సిపల్ లో టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అన్సారీ అనే ఉద్యోగి, లాక్ డౌన్ ను అడ్డం పెట్టుకుని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. సిరిసిల్ల పోలీసులు ప్రజలతో మమేకమై, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ విధులు నిర్వహిస్తుంటే, మున్సిపల్ అధికారుల చర్యలు ప్రజలను అసహనానికి గురి చేస్తున్నాయి. కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధులతో వాగ్వాదం పెట్టుకుంటున్నాడు. ఎవరి అనుమతితో మీరు బయటకు వచ్చారని, ఏ వార్త కవర్ చేస్తున్నారంటూ గద్దించాడు. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.