Jul 22, 2021, 7:17 PM IST
నిర్మల్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం పర్యటించారు. ఉదయం 7.30 గంటల నుంచి వరద ప్రభావిత ప్రాంతాను మంత్రి పరిశీలిస్తున్నారు. పలు కాలనీల్లోబాధితులతో స్వయంగా మాట్లాడిన మంత్రి... వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిదులు ఉన్నారు.