పార్లమెంట్ భవనానికి బ్యానర్ వేలాడదీసి... కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

Mar 21, 2023, 4:26 PM IST

న్యూడిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సంపదను ఆదానీ సంస్థకు అప్పగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదానీ గ్రూప్ - హిడెన్ బర్గ్ వ్యవహారంపై విచారణకు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. జేపిసి (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటుకు ప్రతిపక్షాలు పట్టుబట్టడం... రాహుల్ క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ తో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఈ రోజు ఇరు సభలు వాయిదాపడ్డాయి. 

ఉభయ సభలు వాయిదా పడటంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ మొదటి అంతస్తుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వెంటనే జేపిసి ఏర్పాటు చేయాలంటూ భారీ బ్యానర్ ను పార్లమెంట్ భవనానికి వేలాడదీసి, చేతిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.