Jul 19, 2021, 10:42 AM IST
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ సిఎం జగన్ నివాసం ముట్టడికి యత్నించారు టీఎన్ఎస్ఎఫ్, ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు సీఎం నివాసంవైపు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వారిని సిఎం నివాసానికి వెళ్లే ప్రధాన మార్గం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు టిడిపి, వామపక్ష కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు పోలీసులు.