ఉద్రిక్తత... పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు ఎంపీ కూతురు ప్రయత్నం

Jan 19, 2021, 6:17 PM IST

కృష్ఢా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. అరెస్ట్ చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమాను చూపించాలని... వెంటనే విడుదల చేయాలని టిడిపి నాయకులు నినాదాలు  చేశారు. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోకి  దూసుకెళ్ళేందుకు ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉమాను చూసేందుకు కొంతమందికి అనుమతిచ్చారు పోలీసులు. దీంతో బోడే ప్రసాద్, రావి, నెట్టెం రఘురామ్, తంగిరాల సౌమ్య, శ్వేతలు దేవినేని ఉమను కలిశారు.