Jan 16, 2021, 12:09 PM IST
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వాక్సినేషన్ కేంద్రాలను మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో 40 వేల మందికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. మచిలీపట్నంలో 470మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
తొలిదశలో ముందు వరుస కార్మికులకు టీకాను అందుబాటులో ఉంచామని నాని చెప్పారు. ఒక డోస్ వేసుకున్న 28రోజుల తరువాత మరొడోసు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.
మొదటగా మచిలీపట్నం రూరల్ తాళ్లపాలెం వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తో పాటు రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు