Jul 3, 2022, 1:00 PM IST
అమరావతి : కూతురు వైఎస్. హర్షా రెడ్డి చదివిన కాలేజీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు సతీసమేతంగా ఇటీవల ప్యారిస్ వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఏపీకి చేరుకున్నారు. ప్యారీస్ లోని ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుండి హర్షా రెడ్డి మాస్టర్స్ పూర్తిచేసారు. తాజాగా తల్లి భారతి, తండ్రి జగన్ కళ్ళముందు హర్షా పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని తిరిగివచ్చిన సీఎం జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్ శర్మ, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.