హైద్రాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం: రాజస్థాన్‌‌కి చెందిన నలుగురి అరెస్ట్

By narsimha lode  |  First Published Nov 30, 2022, 9:16 AM IST

రాజస్థాన్  నుండి  హైద్రాబాద్ కి  డ్రగ్స్  సరఫరా చేస్తున్న నలుగురిని  రాచకొండ  పోలీసులు బుధవారంనాడు అరెస్ట్  చేశారు. నిందితుల నుండి ఓపీఎం  డ్రగ్స్ ను సీజ్  చేశారు.


హైదరాబాద్: రాజస్థాన్ నుండి  హైద్రాబాద్‌కి డ్రగ్స్  సరఫరా చేస్తున్న నలుగురు  అంతరాష్ట్ర ముఠాను  రాచకొండ  పోలీసులు బుధవారంనాడు  అరెస్ట్  చేశారు. నిందితుల నుండి  ఓపీఎం డ్రగ్స్ సీజ్  చేశారు.హైద్రాబాద్‌లో  వ్యాపారులకు డ్రగ్స్  సరఫరా చేసేందుకు నిందితులు  ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్‌లో  ఎవరెవరికి  డ్రగ్స్  సరఫరా చేసేందుకు నిందితులు  ప్రయత్నిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

దేశంలోని  పలు రాష్ట్రాల్లో  డ్రగ్స్  సరఫరా  చేస్తూ  పట్టుబడుతున్న కేసులు నమోదౌతున్నాయి. గతంలో  మెట్రో నగరాలకు మాత్రమే  పరిమితమైన డ్రగ్స్  దందా ఇతర ప్రాంతాలకు  కూడా  వ్యాపించింది. కొరియర్ ద్వారా  డ్రగ్స్  సరఫరా  చేస్తూ  కొందరు నిందితులు  పట్టుబడిన  ఘటనలు కూడా చోటు  చేసుకున్నాయి.

Latest Videos

ముంబై ఎయిర్  పోర్టులో  రూ. 50 కోట్ల విలువైన  7.9 కిలోల  విలువైన  హెరాయిన్  ను  డీఆర్ఐ అధికారులు ఈ  నెల  27న చోటు  చేసుకుంది.ఇథియోపియా  నుండి నిందితులు  ఇండియాకు  డ్రగ్స్  సరఫరా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులు  గుర్తించారు. తమ లగేజీ  బ్యాగుల్లో  ఉన్న  పౌడర్ ను  అధికారులు  పరిశీలిస్తే  డ్రగ్స్  లభించాయి.ముంబైలో  నవంబర్  మూడో  వారంలో  నార్కోటిక్స్  కంట్రోల్  బ్యూరో  అధికారులు  సోదాలు నిర్వహించారు. వారం రోజుల్లో  సుమారు కోటి రూపాయాల విలువైన  డ్రగ్స్ ను సీజ్  చేశారు. చాక్లెట్‌లలో  డ్రగ్స్ కలిపి  విక్రయిస్తున్న  నిందితుడిని  తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో పోలీసులు  ఈ నెల  6వ తేదీన  అరెస్ట్  చేశారు. 

also reచంద్రగిరిలో టెన్త్ క్లాస్ విద్యార్ధినికి గంజాయి విక్రయం: స్కూల్ వద్ద పేరేంట్స్ ఆందోళనad:

 అమెరికాలో  విద్యనభ్యసించిన  నిందితుడు  చాక్లెట్లలో  డ్రగ్స్  కలిపి  విక్రయిస్తున్నాడు. యువతను లక్ష్యంగా చేసుకొని ఈ చాక్లెట్లను  విక్రయించేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కాకినాడలో  డీటీడీసీ  కొరియర్ సంస్థ ద్వారా  డ్రగ్స్ ను  ఆర్డర్  చేశారు కొందరు. ఈ ఘటనకు సంబంధం  ఉన్న  12  మందిని పోలీసులు ఈ ఏడాది అక్టోబర్  31న  అరెస్ట్  చేశారు. అమెరికా నుండి  ముంబైకి డ్రగ్స్  సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు  అరెస్ట్  చేశారు. కచ్చితమైన  సమాచారం మేరకు పోలీసులు బీవండిలోని గోడౌన్ కార్యాలయంలో దాడులు నిర్వహించి  డ్రగ్స్ ను ఈ  ఏడాది అక్టోబర్  19న అరెస్ట్  చేశారు.ఇండియా, పాకిస్తాన్  సరిహద్దుల్లో డ్రోన్  ను  బీఎస్ఎఫ్  జవాన్లు  కూల్చివేశారు. డ్రోన్  సహయంతో  పాకిస్తాన్  నుండి  డ్రగ్స్  ను  సరఫరా చేస్తున్నారని ఆర్మీ అధికారులు గుర్తించారు.  ఈ ఘటన ఈ  ఏడాది  అక్టోబర్  18న చోటు  చేసుకుంది. 

click me!