Asianet News TeluguAsianet News Telugu

చంద్రగిరిలో టెన్త్ క్లాస్ విద్యార్ధినికి గంజాయి విక్రయం: స్కూల్ వద్ద పేరేంట్స్ ఆందోళన

చంద్రగిరిలో   టెన్త్  క్లాస్  విద్యార్ధినికి  గంజాయికి  విక్రయించారని ఆరోపిస్తూ  విద్యార్ధుల పేరేంట్స్  ఆందోళనకు దిగారు. 
 

 Parents  Holds  protest  at  Chandragiri  School  in Tirupati  District
Author
First Published Nov 29, 2022, 1:15 PM IST

చంద్రగిరి:తిరుపతి  జిల్లా  చంద్రగిరిలో టెన్త్  క్లాస్  విద్యార్ధినికి  గంజాయి  విక్రయించిన  ఘటన  కలకలం రేపుతుంది.ఈ  విషయమై  స్కూల్  వద్ద  విద్యార్ధుల  పేరేంట్స్  మంగళవారంనాడు  ఆందోళనకు దిగారు. ఇదే  భవనంలోనే  కాలేజీని , స్కూల్ ను నిర్వహిస్తున్నారు. అయితే  ఈ భవనం  సమీపంలో  ఏర్పాటు  చేసిన టీ స్టాల్స్  వద్ద  సిగరెట్లలో  గంజాయిని  అమర్చి  విక్రయిస్తున్నారని  స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న  సాయంత్రం  టెన్త్  క్లాస్  విద్యార్ధిని స్కూల్  నుండి  ఇంటికి  వచ్చింది.  ఇంటికి  వచ్చిన  విద్యార్ధిని  అంగడికి వెళ్లి వస్తానని  చెప్పి గంటన్నర దాటినా కూడ ఆమె రాలేదు. దీంతో  ఆ విద్యార్ధిని  చెల్లెళ్లు  తల్లిదండ్రులకు సమాచారం  ఇచ్చారు.ఈ సమాచారంతో  తండ్రి ఆ బాలిక  కోసం వెతికారు. అయితే  ఓ టీ స్టాల్  వద్ద  విద్యార్ధిని  ఉన్న  విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి తీసుకువచ్చారు. సిగరెట్లలో  గంజాయి  పెట్టి  విక్రయిస్తున్నారని  స్థానికులు  ఆరోపిస్తున్నారు. అమ్మాయిలకు  సిగరెట్లు  ఎలా  విక్రయిస్తున్నారని బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు  ప్రశ్నిస్తున్నారు. ఈ  విషయమై బాధితురాలి  తల్లిదండ్రులు  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. ఇవాళ  ఉదయం  చంద్రగిరి  స్కూల్  వద్ద  విద్యార్ధుల పేరేంట్స్  చేరుకొని ఆందోళన నిర్వహించారు. స్కూల్ కు వచ్చిన  విద్యార్ధులు  ఏం  చేస్తున్నారో  పట్టించుకోరా  అని  ప్రశ్నిచారు. స్కూల్  బయట జరిగిన  ఘటనతో తమకు  ఏం  సంబంధమని స్కూల్  హెడ్  మాస్టర్  ప్రశ్నిస్తున్నారు. స్కూల్  ముగిసిన  తర్వాత  ఈ ఘటన  జరిగిందని  స్కూల్  హెడ్  మాస్టర్  చెబుతున్నారు. స్కూల్ కి సమీపంలోని టీ స్టాల్స్ సహా  ఇతర  పదార్ధాలు విక్రయించేవారిని తొలగించాలని కోరుతామన్నారు.ఈ దుకాణాల్లో  విద్యార్ధులకు  మత్తుపదార్ధాలు  ఏమైనా విక్రయిస్తున్నారా  అనే కోణంలో  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని  స్కూల్  హెడ్  మాస్టర్  మీడియాకు  చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios