Medaram Jathara: 21 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర.. మేడారం జాతర చరిత్ర మీకు తెలుసా?

By Mahesh K  |  First Published Feb 7, 2024, 6:12 PM IST

మేడారం జాతర ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర 21 నుంచి నాలుగు రోజులపాటు సాగుతుంది. ఈ కాలంలోనే సమ్మక్క, సారక్కలు మేడారంలో భక్తులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. సమ్మక్క, సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సమ్మక్క, సారక్క చరిత్ర లేదా మేడారం జాతర చరిత్ర గురించి తెలుసుకుందాం.
 


Sammakka Sarakka Jatara: రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఈ నెల 21వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు సాగనుంది. 1998లో అధికారిక పండుగగా ప్రకటించిన ఈ సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతుంది. మేడారం గ్రామం జనాభా సుమారు 300 ఉంటుంది. కానీ, ఈ జాతరకు సుమారు 1.2 కోట్ల మంది భక్తులు వస్తారని ఒక అంచనా. తెలంగాణ, ఏపీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఈ గిరిజన జాతరకు వస్తారు.

తల్లి సమ్మక్క, బిడ్డ సారలమ్మల వీరోచిత పోరాటాన్ని స్మరించుకోవడమే ఈ జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. మన దేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా భక్తులు వచ్చే జాతర మేడారం జాతరే. అయితే.. ఇది ప్రధానంగా గిరిజనుల జాతర. ఇందులో హైందవ, బ్రాహ్మణ భావజాల ప్రభావమేమీ ఉండదు. అందుకే మేడారం జాతర ఇతర జాతరలకు భిన్నంగా ఉంటుంది. మేడారం జాతర అంటే ఒక చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోవడం. కాకతీయ పాలకుల అన్యాయాన్ని ఎదురించి పోరాడి ప్రాణ త్యాగాలను చేసిన మహిళా యోధులను గుర్తు చేసుకోవడం. జంపన్న త్యాగాన్ని స్మరించుకుని గౌరవించుకోవడం.

Latest Videos

undefined

సమ్మక్క చరిత్ర

పెద్దలు చెప్పే వివరాల ప్రకారం, సమ్మక్క చరిత్ర ఆరేడు శతాబ్దాల కిందిది. కొందరు తెగ నాయకులు వేటకు వెళ్లినప్పుడు అప్పుడే పుట్టిన బాలిక (సమ్మక్క) వారికి కనిపించింది. ఆమెను వెంట తీసుకెళ్లింది. తెగ పెద్ద ఆమెను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశాడు. పగిడిగిద్ద రాజు(కాకతీయుల ట్రైబల్ చీఫ్)కు ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ఇద్దరు బిడ్డలు సారక్క, నాగులమ్మ, ఒక కొడుకు జంపన్న సంతానం.

కాకతీయ పాలకులు తమపై చేస్తున్న అన్యాయాలను సమ్మక్క ఎదురించింది. సమ్మక్క, సారలమ్మ, జంపన్న కాకతీయుల సైన్యంతో పోరాడి మరణించినట్టు చెబుతారు. జంపన్న కాకతీయ సైన్యంతో పోరాడుతూ అక్కడ పారే ఓ వాగులో మరణించినట్టు వివరిస్తారు. అందుకే ఈ వాగును జంపన్న వాగు అని పిలుస్తారు. ఆ వాగును కూడా కొలుస్తారు.

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ వయానాడ్ నుంచి అవుట్? సీటుపై సీపీఐ ఆసక్తి!

జంపన్నవాగు ఇప్పటికీ నెత్తురు నింపుకుని ఎరుపు రంగులో దగదగలాడుతున్నదని భక్తులు భావిస్తారు. అది జంపన్న రక్తమే అని అనుకుంటారు. ఆ జంపన్న వాగులో స్నానం చేసి తమ కోసం ప్రాణాలు అర్పించిన ఆ దేవుళ్ల త్యాగాలను, వారిలో ధైర్యాన్ని నింపారనీ గుర్తు చేసుకుంటారు.

పూజలు

ముందుగా సారక్కను మేడారంలోని గద్దె మీదికి తెస్తారు. గిరిజన పూజారులు మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లికి వెళ్తారు. అక్కడి చిన్న ఆలయంలో పూజలు చేసి దేవతలను మేలుకొల్పుతారు. తద్వార వారు మేడారానికి వచ్చి గిరిజనులను, భక్తులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఆ తర్వాత ఆ దేవతలను గద్దెల మీదికి తెస్తారు.

Also Read: జీవితంపై ఆశలన్నీ ఆవిరయ్యాయి.. ఈ జైలులోనే చస్తే బాగుండు: కోర్టులో జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేష్ గోయల్

బంగారానికి ఆధార్ తప్పనిసరి

సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, ఈ బెల్లం దుర్వినియోగం కావొద్దనే ఉద్దేశ్యంతో అధికారులు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. బంగారం కోసం భక్తులు తప్పకుండా ఆధార్ జిరాక్స్ కాపీని కౌంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

click me!