Manipur violence: మణిపూర్ హింసాకాండ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతాం: మంత్రి కేటీఆర్

By Mahesh Rajamoni  |  First Published Jul 20, 2023, 1:29 PM IST

Manipur violence: పార్ల‌మెంట్ సమావేశాల నేప‌థ్యంలో మ‌నిపూర్ హింస హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి వేదిక‌గా మారింది. తాజాగా మ‌ణిపూర్ హింస‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 
 


Manipur violence issue in Parliament: పార్ల‌మెంట్ సమావేశాల నేప‌థ్యంలో మ‌నిపూర్ హింస హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి వేదిక‌గా మారింది. తాజాగా మ‌ణిపూర్ హింస‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్.. విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వం ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను పున‌రుద్ద‌రించాల‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సి అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు.

మణిపూర్ హింసాకాండ అంశాన్ని లేవనెత్తుతామనీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చూస్తామని కూడా కేటీఆర్ తెలిపారు. ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు మ‌ణిపూర్ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చూస్తారని పేర్కొన్నారు. మ‌హిళ ప‌ట్ల దారుణంగా వ్య‌వరించిన‌,  అత్యాచారానికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు శాంతికాముకులైన మణిపూర్ ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామ‌ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

Latest Videos

కాగా, మ‌ణిపూర్ లో ఒక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా మార్చి.. ఊరేగించ‌డం, వారిపై లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ దృశ్యాల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌ణిపూర్ లో ఈ దుస్థితిని ఎత్తిచూపడానికి ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటిఎల్ఎఫ్) గురువారం ప్రకటించింది. ఈ క్ర‌మంలోనే గుర్తుతెలియని సాయుధ దుండగులపై తౌబాల్ జిల్లాలోని నోంగ్పోక్ సెక్మై పోలీస్ స్టేషన్లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. మే 4న కాంగ్పోక్పి జిల్లాలో జరిగిన ఈ హేయమైన ఘ‌ట‌న‌లో నిస్సహాయులైన మహిళలను పురుషులు నిరంతరం వేధిస్తున్నారనీ, వారు ఏడుస్తూ తమను బందీలుగా పెట్టుకున్న వారిని వేడుకుంటారని ఐటీఎల్ఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

click me!