హైద‌రాబాద్ చిరువ్యాపారులు, స్థానికుల‌ జీవనోపాధిని దెబ్బ‌కొడుతున్న వ‌ర్షాలు..

By Mahesh Rajamoni  |  First Published Sep 10, 2023, 10:02 AM IST

Rains: హైదరాబాద్‌లో ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న‌ వర్షం కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ‌ర్షాల ప్ర‌భావంతో వీధి మార్కెట్ల‌పై ప్ర‌భావం ప‌డింద‌నీ, ముఖ్యంగా చిరు వ్యాపారులు, స్థానికంగా జీవ‌నోపాధి పొందుతున్న వారిపై అధికంగా ప్ర‌భావం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వీధుల్లో చిన్న వస్తువులను విక్రయించి జీవనోపాధి పొందే స్థానిక వ్యాపారులు లేదా సీజ‌న్ కు సంబంధించి వ్యాపారాలు నిర్వ‌హించే వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
 


Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న‌ వర్షం కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ‌ర్షాల ప్ర‌భావంతో వీధి మార్కెట్ల‌పై ప్ర‌భావం ప‌డింద‌నీ, ముఖ్యంగా చిరు వ్యాపారులు, స్థానికంగా జీవ‌నోపాధి పొందుతున్న వారిపై అధికంగా ప్ర‌భావం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వీధుల్లో చిన్న వస్తువులను విక్రయించి జీవనోపాధి పొందే స్థానిక వ్యాపారులు లేదా సీజ‌న్ కు సంబంధించి వ్యాపారాలు నిర్వ‌హించే వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.

గ‌త కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో హైద‌రాబాద్ నగరంలోని వ్యాపారాలపై నీడలు కమ్ముకున్నాయనీ, నష్టాలు కాకపోయినా వ్యాపారం తగ్గుతుందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.  రాష్ట్రంలో జూలై, ఆగస్టు నెలల్లో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో వరదలు వచ్చాయి. వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో వారాంతాల్లో కూడా పర్యాటకులు మార్కెట్లకు దూరంగా ఉన్నారు. గత రెండు నెలలుగా దుకాణదారులు మార్కెట్లకు దూరంగా ఉంటున్నారు. నెలల తరబడి మంచి వ్యాపారం జరగలేదనీ, ఖర్చులు భరించడం కష్టంగా మారిందని పాతేర్‌గట్టిలోని బట్టల వ్యాపారి సయ్యద్ షౌకత్ ఆవేద‌న వ్య‌క్తం చేసిట‌న‌ట్టు సియాస‌త్ నివేదించింది. పాతేర్‌గట్టి, మదీనా బిల్డింగ్, గుల్జార్ హౌజ్, చార్మినార్ వద్ద ఉన్న మార్కెట్లు దేశం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తాయి. దేశీయ పర్యాటకులు కూడా వెళ్లి కొనుగోళ్లు చేస్తుంటారు.

Latest Videos

భారీ వర్షాలు, వారాంతాలు, సెలవు దినాల్లో ప్రజలు బయటకు రావొద్దని నిరంతర హెచ్చరికల కారణంగా వ్యాపారాలకు ఆదాయం లేకుండా పోయిందని తెలిపారు. వర్షాకాలంలో మార్కెట్లను రాత్రి 10 గంటలకే మూసివేయాల్సి ఉండగా రాత్రి 8 గంటలకే మూసివేశారు. దీంతో సాయంత్రం వ్యాపారం కూడా దెబ్బతిన్న‌ద‌ని లాడ్ బజార్ బంగ్లే మార్కెట్ కు చెందిన ఒక వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ మందగమనం, అధ్వాన్నమైన రహదారి పరిస్థితుల కారణంగా సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ లు ప్రజలు దూరంగా ఉండటానికి ఇతర కారణాలుగా ఉన్నాయి. నేటి రోజుల్లో ప్రజలు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి ట్రాఫిక్ పరిస్థితులను తనిఖీ చేస్తారు. నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండటాన్ని గమనించిన వారు షాపింగ్ కు వెళ్లే ప్రణాళికను విరమించుకుంటారని గుల్జార్ హౌజ్ కు చెందిన వ్యాపారి వజాహత్ హుస్సేన్ వివరించారు.

నయాపూల్ జంక్షన్ నుండి షహలీబండ వరకు దాదాపు 4,000 దుకాణాలు నడుస్తాయి. సుమారు 2,000 మంది చిన్న- స్వ‌ల్ప‌కాల వ్యాపారులు తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వీధుల్లో చిన్నచిన్న వస్తువులను విక్రయించి జీవనోపాధి పొందుతున్న స్థానిక వ్యాపారులు లేదా తోపుడు బండ్ల వ్యాపారులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. చార్మినార్ సమీపంలో లేడీస్ యాక్సెసరీస్ అమ్మే నయీం మాట్లాడుతూ.. రోజూ రూ.200 రూపాయ‌లు సంపాదిస్తున్నామ‌నీ, మంచి బిజినెస్ డే రోజున రూ.600 నుంచి రూ.700 సంపాదించగలుగుతున్నామ‌ని చెప్పారు.

click me!