డ్రగ్స్ కేసులో అరెస్టైన ఎడ్విన్ కు బెయిల్: జైలు నుండి విడుదల

By narsimha lode  |  First Published Nov 17, 2022, 10:01 AM IST

ఈ నెల  5న గోవాలో  అరెస్టైన  ఎడ్విన్ కు  బెయిల్  మంజూరైంది. దీంతో  ఎడ్విన్ చంచల్ గూడ  జైలు నుండి  విడదలయ్యారు.  పీడీయాక్ట్ ను  ఆయనపై  ప్రయోగించే  సమయానికే   బెయిల్ పై  ఆయన  విడుదలయ్యాడు.


హైదరాబాద్: డ్రగ్స్  కేసులో  అరెస్టైన  ఎడ్విన్  కు కోర్టు  బెయిల్  మంజూరు చేసింది.దీంతో చంచల్ గూడ జైలు నుండి  ఎడ్విన్  విడుదలయ్యాడు.  మూడు మాసాలపాటు  గోవాలో  ఆపరేషన్  నిర్వహించి ఎడ్విన్ ను  హైద్రాబాద్  పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎన్‌డీపీఎస్  యాక్ట్ కింద హైద్రాబాద్  పోలీసులు  గోవాలో  ఎడ్విన్ ను  పోలీసులు  అరెస్ట్ చేశారు. ఈ నెల  5వ  తేదీన  ఎడ్విన్ ను  గోవాలో  పోలీసులు  అరెస్ట్ చేసి  హైద్రాబాద్  కు తీసుకు వచ్చారు. 

హైద్రాబాద్  లో ఎడ్విన్ పై మూడు  కేసులు  నమోదయ్యాయి.  సికింద్రాబాద్  పరిధిలోని  రాంగోపాల్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలో  నమోదైన కేసులో  ఎడ్విన్ ను  పోలీసులు  అరెస్ట్ చేశారు.  అయితే  మరో  రెండు  కేసుల్లో  ఎడ్విన్  ముందస్తుు  బెయిల్  తెచ్చుకున్నారు. అయితే రాంగోపాల్  పేట పోలీస్ స్టేషన్  పరిధిలో నమోదైన  కేసులో  ఎడ్విన్ కు  హైకోర్టు  బెయిల్  మంజూరు  చేసింది.  దీంతో  ఎడ్విన్  చంచల్ గూడ  జైలు  నుండి  బయటకు  వచ్చాడు.  

Latest Videos

గోవా పోలీసుల  సహయంతో  తెలంగాణ పోలీసులు  ఎడ్విన్ ను పట్టుకొనేందుకు  శ్రమించారు. గోవాలో  తెలంగాణ పోలీసులు  ఎడ్విన్ ను  అష్టదిగ్ధంధం చేసి అరెస్ట్ చేసినా  ప్రయోజనం  లేకుండాపోయింది. హైద్రాబాద్  కు  గోవా నుండి   డ్రగ్స్ తరలిస్తున్నారని  పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్  లో డ్రగ్స్   లేకుండా  ఉండాలని పోలీసలు  ప్రయత్నిస్తున్నారు.  తెలంగాణ  సీఎం  కేసీఆర్ ఆదేశాల  మేరకు  డ్రగ్స్   సరఫరా చేసే వారితో  పాటు  డ్రగ్స్  వినియోగించే వారిపై  పోలీసులు నిఘాను  ఏర్పాటు చేశారు. హైద్రాబాద్ సీపీగా  సీవీ  ఆనంద్  బాధ్యతలు  చేపట్టిన తర్వాత డ్రగ్స్  సరఫరా చేసే వారిపై ,వినియోగించేవారిపై  కేసులు ఎక్కువయ్యాయి.  ముంబైలో  డ్రగ్స్ సరఫరా  చేసే  టోనిని హైద్రాబాద్  పోలీసులు అరెస్ట్ చేశారు. టోని  కోసం  చాలా  ఏళ్లుగా  ప్రయత్నించారు. కానీ  ఫలితం  దక్కలేదు.  కానీ  హైద్రాబాద్  పోలీసులు ముంబైలో  మకాం  వేసి టోనిని  అరెస్ట్ చేశారు.  టోనిని  అరెస్ట్ చేసిన  తరహలోనే  ఎడ్విన్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.ఎడ్విన్ పై  పీడీ  యాక్ట్  ను  ప్రయోగించేలోపుగానే  బెయిల్ పై  అతను  విడుదలయ్యాడు.

also  read:డ్రగ్స్ కేసు: తెలంగాణ హైకోర్టులో ఎడ్విన్ ముందస్తు బెయిల్ పిటిషన్

నకిలీ  కరోనా సర్టిఫికెట్  తో  ఎడ్విన్  హైద్రాబాద్  పోలీసులను  బురిడీ కొట్టించాడు . కరోనా రాకున్నా  కరోనా  వచ్చినట్టుగా నకిలీ  సర్టిఫికెట్  సృష్టించిన విషయమై  పోలీసులు  కేసు నమోదు చేశారు.  గోవా పోలీసుల సహయంతో  ఈ సర్టిఫికెట్  నకిలీ  సర్టిపికెట్  గా పోలీసులు  గుర్తించారు.
 

click me!