31మంది మహిళలను అత్యాచారం చేసిన సీరియల్ రేపిస్టును 40 ఏళ్ల తర్వాత గుర్తించిన పోలీసులు.. భార్య, కుటుంబీకులు షాక్
దాదాపు 31 మంది మహిళలను రేప్ చేసిన సీరియల్ రేపిస్టును ఆస్ట్రేలియా పోలీసులు 40 ఏళ్ల తర్వాత గుర్తించారు. మరో 19 నేరాల్లోనూ ప్రమేయం ఉన్న ఈ రేపిస్టు నేరాలకు పాల్పడుతూనే ప్రశాంత జీవితం గడిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించాడు.
న్యూఢిల్లీ: ఆయన ఓ సీరియల్ రేపిస్టు. 1985 నుంచి 2001 మధ్య సుమారు 31 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. 14 ఏళ్ల బాలికల నుంచి 55 ఏళ్ల వయసు మహిళల వరకు ఎంతో మందిని ఆ నేరస్తుడు రేప్ చేశాడు. కానీ, తన కుటుంబం, కమ్యూనిటీలో ఎంతమాత్రం అనుమానం రాకుండా మంచి మనిషిగా చలామణి అయ్యాడు. 66 ఏళ్ల వయసులో ఫిబ్రవరిలో కన్నుమూశాడు. ఈ నేరాలకు పాల్పడిన 40 ఏళ్ల తర్వాత పోలీసులు ఆ నేరస్తుడిని డీఎన్ఏ సహకారంతో గుర్తించారు.
ఆస్ట్రేలియాకు చెందిన కెయిత్ సిమ్స్‌ను పోలీసులు డీఎన్ఏ సహాయంతో 40 ఏళ్ల తర్వాత గుర్తించారు. ఈ విషయాన్ని అతని భార్య, కుటుంబ సభ్యుల ముందు ప్రస్తావిస్తే వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
1985 నుంచి 2001 మధ్య కాలంలో పలువురు మహిళలపై లైంగికదాడి కేసులను పోలీసులు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, ఆ కేసుల్లో నిందితులంతా వేర్వేరు మనుషులను పోలీసులు భావించారు. అందుకే ఆ కేసులను వేర్వేరుగా దర్యాప్తు చేశారు. కానీ, 2000 సంవత్సరంలో ఈ కేసుల్లో పోలికలను గుర్తించి.. ఒకే నిందితుడి వైపుగా దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read: కదులుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్, మహిళతో సహా నలుగురి అరెస్ట్..
కెయిత్ సిమ్స్ కుటుంబం, మిత్రులు అతనిని బెస్ట్ ఫాదర్, గ్రాండ్ ఫాదర‌్‌గా చెప్పారు. కమ్యూనిటీలోనూ ఆయనకు మంచి పేరుందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. తాము కెయిత్ సిమ్స్ భార్యను కలిశామని, ఈ విషయం తెలుసుకుని ఆమె దిగ్భ్రాంతి చెందిందని డిటెక్టివ్ సెర్జంట్ షెల్లీ జాన్స్ డైలీ టెలిగ్రాఫ్‌కు తెలిపారు. తాను ఇన్నాళ్లు చూసిన వ్యక్తి సీరియల్ రేపిస్టు అంటే నమ్మలేకపోయిందని వివరించారు.
ఈ రేప్ కేసుల్లోని బాధితులంతా నిందితుడి గురించి ఒకే తరహా వర్ణనలు ఇచ్చారని తెలిపారు. నేరానికి పాల్పడేటప్పుడు నిందితుడు క్యాజువల్ క్లాథ్స్ ధరించాడని, చామన చాయ మనిషి అని వివరించారు. ముఖానికి ముసుగేసుకుని కత్తితో బెదిరించి ఈ నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు.
పోలీసుల డేటాబేసులోకి కెయిత్ సిమ్స్ వంశ డీఎన్ఏ వచ్చి చేరింది. దీంతో సరిగ్గా సరిపోలే డీఎన్ఏ కోసం 324 మందివి టెస్టు చేశారు. ఇందులో సిమ్స్ డీఎన్ఏ బాధితుల నుంచి సేకరించిన డీఎన్ఏతో ఫర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది.
సిడ్నీలో మూడు దశాబ్దాలుగా కలకలం రేపిన ఈ నిందితుడికి మరో 19 నేరాల్లో ప్రమేయం ఉన్నది. 2001లో ఓ స్మశానం దగ్గర చివరి నేరం చేసినట్టు పోలీసులు తెలిపారు.