రౌండప్ 2019: కొత్త సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్స్ పై...నిపుణులు అంచనా ఏంటంటే...?

By Sandra Ashok Kumar  |  First Published Dec 23, 2019, 12:05 PM IST

వినియోగదారులు కొత్త స్మార్ట్ ఫోన్లు కొనాలంటే మరో ఆరు త్రైమాసికాల తర్వాతేనని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. 2019లో 9 శాతం పెరిగిన స్మార్ట్ ఫోన్ల సేల్స్ వచ్చే ఏడాది ఐదు శాతానికే పరిమితం అని ఐడీసీ ఇండియా తెలిపింది. కొత్త స్మార్ట్ ఫోన్లలో ఇన్నోవేషన్ లేకపోవడం, ధరలు అధికంగా ఉండటంతో కస్టమర్లు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ మరో ఏడాది పాటు కొనసాగించేందుకు ఇష్ట పడతారని పేర్కొంది.


న్యూఢిల్లీః భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 2020లో తగ్గుముఖం పట్టనున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు ప్రత్యేకించి ఫోన్ల వినియోగదారులు దీర్ఘకాలికంగా వాటిని వినియోగించుకోనున్నారు. దీనికి నూతన స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ, అధిక ధరల విషయమై స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల్లో ఇన్నోవేషన్ కొరవడటమే దీనికి కారణమని తెలుస్తున్నది. 

ఇటీవలి పండుగల సీజన్‌లో భారీ స్థాయిలో పేరుకుపోయిన ఇన్వెంటరీలను సదరు సంస్థలు క్లియర్ చేసుకోగలిగాయి. కానీ వచ్చే ఆరు త్రైమాసికాల తర్వాత మాత్రమే ఇన్వెంటరీ (ఫోన్ల నిల్వలు) క్లియర్ చేసుకునే వీలు కలుగుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

also read ఇండియాలో 10 కోట్ల స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తికి ఒప్పో లక్ష్యం

2020లో స్మార్ట్ ఫోన్ల వృద్ధిరేటు కేవలం ఐదు శాతానికి పరిమితం అవుతుందని రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2016లోనూ స్మార్ట్ ఫోన్ల వృద్ధిరేటు ఐదు శాతానికి పరిమితమైంది. అంటే 2020లోనూ నాలుగేళ్ల క్రితం పరిస్థితి నెలకొంటుందన్న మాట.

ఈ దఫా జీవితకాలంలో స్మార్ట్ ఫోన్ల రీ ప్లేస్‌మెంట్ మూడు నెలల నుంచి 14-15 నెలలకు పెరుగుతుందని మాధవ్ సేథ్ స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని కస్టమర్లు వాయిదా వేస్తారని, 20 శాతం విక్రయాలు 2021కి వాయిదా పడతాయని స్పష్టం చేశారు. కొనుగోలు దారులు తృతీయ, నాల్గవ శ్రేణి పట్టణాల్లో ఫీచర్ ఫోన్ల నుంచి చౌక స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లుతారని, అది కూడా ఐదు శాతం మించదని మాధవ్ సేథ్ తేల్చి చెప్పారు. 

2019లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 9 శాతానికి పెరుగుతాయని టెక్ నిపుణులు అంచనా వేశారు. 2015లో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో గరిష్ఠంగా 29% పురోగతి నమోదైంది. నోట్ల రద్దు ఫలితంగా 2016లో ఐదు శాతానికి పడిపోయింది. తిరిగి 2017, 2018 సంవత్సరాల్లో 14 శాతానికి చేరుకున్నదని ఐడీసీ ఇండియా తెలిపింది. 

ఐడీసీ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవ్కేందర్ సింగ్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో శరవేగంతో కూడుకున్న వృద్ధిరేటు నమోదైందన్నారు. ప్రతి 12-16 నెలల మధ్యలో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లను రీప్లేస్ చేసుకోవడమే దీనికి కారణమని చెప్పారు. 

ఈ సైకిల్ ఇక 20 నెలల వరకు వెళుతుందన్నారు. తదుపరి రెండేళ్ల వరకు స్మార్ట్ ఫోన్ల రీప్లేస్ మెంట్ సాగుతుందని ఐడీసీ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవ్కేందర్ సింగ్ అన్నారు. బెటర్ ఫోన్లు అందుబాటులోకి రానందునే వినియోగదారులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లనే కొనసాగించడానికి ప్రాధాన్యం ఇస్తారని నవ్కేందర్ సింగ్ చెప్పారు. 

also read కొత్త ఆడియో పార్టీ స్పీకర్స్ లాంచ్... అతి తక్కువ ధరకే..

దీనికి తోడు స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగి పోవడం కూడా వాటి కొనుగోళ్లు తగ్గడానికి మరో కారణం. కస్టమర్లు గరిష్టంగా రూ.15 వేల ధర వరకు మాత్రమే ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారని టెక్ ఆర్క్ సహ వ్యవస్థాపకుడు ఫైజల్ కవూజా చెప్పారు. మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల ఇన్వెంటరీ భారీగా ఉండటం ఆందోళనకరమని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 

2019లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయని భావించాం. వృద్ధిరేటు 8-9 శాతం ఉంటుందని, వచ్చే ఏడాది 5-6 శాతానికి పరిమితం అవుతుందని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ అన్నారు.  స్మార్ట్ ఫోన్ల తయారీలో ఇన్నోవేషన్ వాస్తవ డిఫరెన్సియేషన్ ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫీచర్ ఫోన్ల వాడకం దారులు ఎటువంటి ఇన్నోవేషన్ పొందలేకపోతున్నందున స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు ఎక్కువగా ఉండక పోవచ్చునన్నారు. 
 

click me!